వైవిధ్యమైన  కథలను ఎంచుకుంటూ వరుస  హిట్స్ ను అందుకుంటోన్న యంగ్ హీరో అడివి శేషు. ఆయన తాజాగా  ‘ఎవరు’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆగష్టు 23న విడుదల కానున్న ఈ మూవీకి  ప్రమోషన్లను ప్రారంభించి రచ్చ రచ్చ చేస్తున్నారు  అడవి శేషు.   ఈ చిత్రంలో విక్రమ్ వాసుదేవ్ అనే అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడవి శేషు కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి సంభందించిన మరో విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. 

ఈ సినిమా ద్వారా ఒకనాటి యాంకర్ మరియు  నటి అయిన జాన్వీ రీఎంట్రీ ఇస్తోంది.  అయితే మీరు అనుకుంటున్నట్లుగా నటిగా కాదు.. ఫ్యాషన్ డిజైనర్ . ఇలా ఆమె  ఊహించని విధంగా రీఎంట్రీ ఇవ్వడం ఇంట్రస్టింగ్ గా ఉంది.  మొదట్లో  టీవీ షోలతో పాపులరైన జాన్వీ ఆ తర్వాత  క్యారక్టర్ ఆర్టిస్ట్ గా  తెలుగు సినిమాల్లో ఛాన్సులు  పొందింది. నటిగా కొన్నాళ్లు కొనసాగినా అటుపై పెళ్లితో కెరీర్ కి బ్రేక్ పడింది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రసూల్ ఎల్లోర్ ని ఆమె  పెళ్లాడింది.

మళ్లీ ఇంతకాలానికి  జాన్వీ  ప్రస్తుతం రూటు మార్చి ఫ్యాషన్ డిజైనర్ గా రాణించే ప్రయత్నం చేస్తోంది. ఆమె తొలిసారిగా అడివి శేష్ నటించిన `ఎవరు` చిత్రానికి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేశారు. కొన్ని కీలక సీన్స్ లో  శేష్- రెజీనా పాత్రలకు ఔట్ ఫిట్స్ రూపొందించింది తనేనట.  జాన్వికి  పదేళ్ల కుమారుడు ఉన్నాడు.  

ఇక ఎవరు విషయానికి వస్తే..థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో రెజీనా హీరోయిన్‌గా కనిపించనుండగా.. నవీన్ చంద్ర, మురళీ శర్మ కీలక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను పీవీపీ బ్యానర్‌పై పర్ల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మిస్తున్నారు. వెంకట్ రాంజీ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.