యంగ్ హీరో అడివి శేషు వరుస విజయాలతో మంచి జోరుమీదున్నారు. ఆయన నటించిన గూఢచారి, ఎవరు,  ఓ బేబీ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక మహేష్ లాంటి సూపర్ స్టార్ బ్యానర్ లో ఆయన ఏకంగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ మూవీలో అడివి శేషు నటిస్తున్నారు. మేజర్ మూవీ కోసం అడివి శేషు చాలా హోమ్ వర్క్ చేశారు. 


పరిశ్రమలో పాజిటివ్ బజ్ నెలకొన్న ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలున్నాయి. కాగా నాని నిర్మాత హిట్  చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతుండగా హీరోగా అడివి శేషు ఎంపికయ్యారు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ మూవీ విజయం సాధించగా దానికి కొనసాగింపుగా హిట్ 2 తెరకెక్కనుంది. వరుస విజయాలు, ఆఫర్స్ తో దూసుకు వెళుతున్న అడివి శేషు ప్రేమలో పడ్డారన్న వార్తలు ఆసక్తిరేపుతున్నాయి. అడివి శేషు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న, వరుస కథనాల నేపథ్యంలో ఆయన స్పందించారు. 


నా కెరీర్ ప్రస్తుతం చాలా బాగుంది. మంచి ఆఫర్స్ వస్తున్నాయి, షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నాను. కాబట్టి పెళ్లి గురించి ఆలోచించే సమయం లేదు. అయితే నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీరు అనుకున్నట్లు ఆమె బాలీవుడ్ అమ్మాయి కాదు, హైదరాబాద్ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పను, ఎందుకంటే దానికి ఆమె అనుమతి కావాలి... అంటూ అసలు విషయం బయటపెట్టారు. దీంతో అడివి శేషు లాంటి హ్యాండ్ సమ్ ని వలలో వేసుకున్న ఆ లక్కీ గర్ల్ ఎవరని అందరూ ఆలోచనలో పడ్డారు.