ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరిజగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. హీరోగా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 'బంపర్ ఆఫర్' తప్ప అతడి లిస్ట్ లో మరో హిట్టు పడలేదు. 

హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వర్కవుట్ అవ్వడం లేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చేశాడు. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. కృష్ణ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. ఈ సినిమాకు నిర్మాతలుగా కొంతమంది వైసీపీ పార్టీ పెద్దలు వ్యవహరించనున్నారని సమాచారం.

పూరికి వైకాపాతో మంచి సంబంధాలు ఉన్నాయి. పూరి సోదరుడు వైకాపా పార్టీ తరఫున నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిచినా సంగతి తెలిసిందే. ఇప్పుడు పూరి తమ్ముడు నటిస్తోన్న సినిమాకు వైసీపీ పార్టీ పెద్దలు నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం. వీరి సపోర్ట్ తో ఈసారైనా సాయిరామ్ శంకర్ \సక్సెస్ అవుతాడేమో చూడాలి!