వైఎస్ రాజశేఖర్ రెడ్డి  పాదయాత్ర కాన్సెప్ట్ తో రాబోతున్న మమ్ముంటి యాత్ర సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు టాక్. ఇక ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. 13 కోట్లవరకు సినిమా బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

సినిమా ఎంతవరకు లాభాల్ని అందిస్తుందో చెప్పడం కష్టమే గాని మొదట 15 కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. నైజం వంటి కొన్ని ఏరియాల్లో నిర్మాతలే సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఓవర్సీస్ లో కూడా 2కోట్లతో సినిమాను నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు . వైఎస్ అభిమానులు సినిమాపై ఆసక్తిగా ఉన్నారు. దీంతో సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటుందని సమాచారం. 

ట్రైలర్ తో పాటు సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది. చూస్తుంటే ఆంధ్రలో సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ అందే అవకాశం ఉంది. ఆంధ్ర ఏరియాలో 5.5కోట్ల ధర పలికిన యాత్ర సీడెడ్ లో 2.2కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా సినిమా హిట్టవ్వాలంటే 13 కోట్ల షేర్స్ ను రాబట్టి తీరాలి. మరి ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.