దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తోన్న సినిమా 'యాత్ర'. మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మమ్ముట్టి.. వైఎస్ పాత్రలో కనిపించనున్నాడు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన చిత్రబృందం. ట్రైలర్ ని బట్టి వైఎస్ పాత్రలో మమ్ముట్టి జీవించేసాడని అనిపిస్తోంది. 'వినాలని ఉంది, తెలుసుకోవాలి ఉంది, ప్రతి గడపలోకి వెళ్ళాలని ఉంది' అంటూ చెప్పిన డైలాగ్ వైఎస్ పాదయాత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.

వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు ఆనధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాన్ని చర్చించినట్లు ట్రైలర్ ని బట్టి అర్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, పార్టీ నిర్ణయాన్ని కాదని ఎదురెల్లిన వైఎస్ ఇలా చాలా వరకు సినిమాలో చూపించబోతున్నారు.

మమ్ముట్టి ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఫిబ్రవరి 8న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.