దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు వస్తోన్న స్పందన చూస్తుంటే తనకు భయమేస్తుందని అన్నాడు దర్శకుడు.

వైఎస్ మీద ప్రజల్లో ఇంతటి అభిమానం ఉందని, ఇంతగా ఈ సినిమా చూసి స్పందిస్తారని తాను ఊహించలేదని అన్నాడు. వందల కొద్దీ మెసేజ్ లు, ఫోన్లు వస్తున్నాయని. ఒక్కొక్కరూ స్పందించిన తీరు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పారు.

ప్రజల్లో వైఎస్ మీద ఇంత అభిమానం ఉందని, ఈ విధంగా స్పందిస్తారని తెలిస్తే అంచనాల భయంతో ఈ సినిమా తీసేవాడిని కాదని అన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోట్లు వసూలు చేసిన సినిమా తీసిన ఈ సినిమా ఇచ్చిన సంతృప్తి ఇవ్వలేవని చెప్పారు. కొన్ని సినిమాలను కలెక్షన్లతో కొలిచి చూడకూడదని, 'యాత్ర' కూడా అలాంటి చిత్రమేనని అన్నారు.

తెలంగాణా ప్రాంతం నుండి కూడా కొందరు ఫోన్లు చేసి సినిమా గురించి గొప్పగా మాట్లాడారని తెలిపారు. గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజే దాదాపు నాలుగు కోట్ల వరకు వసూలు చేసి నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చే దిశగా పరుగులు తీస్తోంది!