Asianet News TeluguAsianet News Telugu

వై.ఎస్.జగన్ బర్త్ డే గిఫ్ట్... యాత్ర 2 నుంచి స్పెషల్ పోస్టర్

ఈరోజు  ( డిసెంబర్ 21) వైఎస్ జగన్ బర్త్ డే సందర్భంగా ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న యాత్ర2 మూవీ నుంచి స్పెషల్ అప్ డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  
 

Yatra 2 Movie Special Look Poster Release For Y S Jagan Birthday JmS
Author
First Published Dec 21, 2023, 1:45 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా యాత్ర2.  మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా ఇది. ఈమూవీలో  వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సినిమాలో ప్రముఖ పాత్రల లుక్స్‌కి సంబంధించిన పోస్టర్స్‌ను మేకర్స్ విడుదల చేస్తూ వచ్చారు. తాజాగా ఈమూవీ నుంచి మరో సాలిడ్ అప్ డేన్ ను  మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈరోజు (డిసెంబర్ 21)  వై.ఎస్.జగన్  పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితంఆధారంగా తెరకెక్కుతోన్న యాత్ర2 సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఇక ఈసినిమాలో  కోలీవుడ్ స్టార్ జీవా జగన్ పాత్రలో కనిపించబోతున్నాడు. జగన్ గా జీవ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పుట్టినరోజు సందర్భంగా యాత్ర 2 టీమ్ సంబరాలు చేసుకున్నారు. 

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర  ఆధారంగా యాత్ర సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ మహి వి రాఘవ్. ఈ సినిమా జనాల్లో మంచి పేరు సాధించడంతో పాటు..  అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రంగా అవార్డ్ లను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈమూవీకి  కొన‌సాగింపుగా, వైఎస్‌.ఆర్ త‌న‌యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు యాత్ర 2 ని తెర‌కెక్కిస్తున్నారు. 

యాత్ర సినిమాను ఫిబ్ర‌వ‌రి 8 2019లో రిలీజ్ చేయగా.. యాత్ర 2 ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈసినిమా షూటింగ్  శ‌ర‌వేగంగా తెరకెక్కుతుండగా ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios