తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల యాషికా అలియాస్‌ ఎస్తర్‌ ప్యూలా రాణి ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న యాషిక ప్రియుడితో గొడవపడి మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. యాషిక చివరగా రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు కనుగొన్నారు. 

ఈ క్రమంలో యాషికా ప్రేమించిన మోహన్‌బాబు అలియాస్‌ అరవింద్‌ ను అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు గొడవపడి విడిచి వెళ్లిపోవడం వల్లే యాషిక మనోవేధనతో ఆత్మహత్య చేసుకున్నట్లు చివరి లేఖ ద్వారా తెలిసింది. సోషల్ మీడియాలో కూడా సూసైడ్ లెటర్ వైరల్ గా మారింది. 

.లేఖలో యాషిక ఈ విధంగా పేర్కొన్నారు. 

'హాయ్‌ మొగుడా. ఐ లవ్‌ యూ సోమచ్‌. నువ్వంటే నాకు ప్రాణం. నాపై నీకు ప్రేమ లేదు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏడాది పాటు దంపతులుగా జీవించాం. నేనే అన్ని విషయాల్లో సర్దుకుపోయాను. ఎవరి గురించి నువ్వు ఆలోచించవ్. కొంచెం కూడా నాపై ఫీలింగ్ లేదు. 

అన్నం తిని మూడు రోజులైంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. నిన్ను ఇక కష్టపెట్టను. నేను మరణించిన తరువాత నన్ను తలచుకుంటావో లేధో తెలియదు. కానీ నాకు బ్రతకాలని లేదు. ఐ లవ్‌ యూ మామా.. ఐలవ్‌ యూ అరవింద్, మొగుడా.. వెళ్లిపోతున్నాను. నువ్వు హ్యాపీగా ఉండాలని వెళుతున్నా' అని యాషిక ఆత్మహత్య లేఖలో వివరణ ఇచ్చారు.