బూతుని ఎలా క్యాష్ చేసుకోవాలి అనే విషయమై తమిళ పరిశ్రమ రీసెర్చ్ పోగ్రాం పెట్టినట్లుంది.  'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో వస్తోంది. ఆ చిత్రం తమిళ వెర్షన్ అక్కడ దుమ్ము రేపింది. ఆ సినిమా ప్రేరణ ఏమో కానీ ఇప్పుడు ఓ అడల్ట్ కామెడీ రెడీ అవుతోంది. అయితే కేవలం అడల్డ్ కామెడీ అంటే జనం  ఆసక్తి చూపరేమో అని, దానికి త్రీడి అనే హంగను చేరుస్తున్నారు. ఇందులో స్టార్ కమిడయన్ యోగిబాబు నటిస్తున్నారు. 

క్రితం సంవత్సరం కమిడియన్స్ లో  ట్రెండింగ్‌ నటుడిగా నిలిచాడు యోగిబాబు. అదే ఊపుని  ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తమిళంలోలో అడల్ట్‌ కామెడీ చిత్రాల జోరు పెరుగుతోంది. అలాంటి కథతో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు యోగిబాబు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్   పెట్టలేదు. 3డీలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.  ఈ సినిమాలో లో యోగిబాబుకు జోడీగా యాషికా, నిక్కితంబోలిలు నటిస్తున్నారు. 

ఈ సినిమా గురించి దర్శకుడు వినాయక్‌ శివ మాట్లాడుతూ ‘ఇది అడల్ట్‌ కామెడీ జోనర్‌ చిత్రం. హర్రర్‌ అంశాలు కూడా నిండి ఉన్నాయి. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించ లేదు. యువతకు నచ్చేలా తెరకెక్కిస్తున్నాం. 3డీలో సినిమాను తీసుకొస్తుండటం ఆనందంగా ఉంది. నెలాఖరులో చిత్రీకరణ ప్రారంభం కానుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని’ పేర్కొన్నారు.