సంచలనాలకు కేరాఫ్‌ గా నిలిచిన `కేజీఎఫ్‌ 2` మూవీ మరో అరుదైన రికార్డు ని సాధించింది. ఏకంగా ప్రపంచ రికార్డ్ ని క్రియేట్ చేయడం విశేషం. 

`కేజీఎఫ్‌2`(KGF2) సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన చిత్రం. ఎంతో మంది ప్రతిభావంతులను వెండితెరకి పరిచయం చేసిన చిత్రమిది. సౌత్‌ సినిమా సత్తాని చాటిన చిత్రం. ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో, రాకింగ్‌ స్టార్‌ యష్‌(Yash) హీరోగా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. రెండో భాగం `కేజీఎఫ్‌ 2` ఏప్రిల్‌లో విడుదలై రికార్డ్ విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. 

థియేటర్‌లోనే కాదు, ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్‌ సాధించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో మోస్ట్ పాపులర్‌ ఇండియన్‌ ఫిల్మ్ కేటగిరిలో ఐఎండీబీ సంస్థ విడుదల చేసిన జాబితాలో `కేజీఎఫ్‌ 2` ఏకంగా 8.5రేటింగ్‌తో రెండో స్థానంలో నిలవడం విశేషం. అంతేకాదు ఇప్పుడు మరో రికార్డ్ ని క్రియేట్‌ చేసింది. సినిమాల రివ్యూస్‌, రేటింగ్‌లు ఇచ్చే ఓర్‌ మాక్స్ పవర్‌ రేటింగ్స్ లో 90ప్లస్‌ స్కోర్‌ సాధించిన తొలి చిత్రంగా నిలవడం విశేషం. ఇది వరల్డ్ రికార్డ్ కావడం మరో విశేషం.

దక్షిణాది భాషలు, హిందీతో కలిపి ఓర్‌ మ్యాక్స్ పవర్‌ రేటింగ్స్ లో ఈ ఘనత సాధించడం విశేషం. ఇది అరుదుగా దక్కే గౌరవమని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలా వరుస రికార్డ్ లతో దూసుకుపోతుంది `కేజీఎఫ్‌2`. కోలార్‌ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో గోల్డ్ మాఫియా ప్రధానంగా సాగే చిత్రమిది. మాఫియా ప్రపంచంలో ఓ కుర్రాడు ఎంపరర్‌ గా ఎదిగిన తీరుని ఆవిష్కరించిన చిత్రమిది. ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పించే సన్నివేశాలు, మదర్‌ ఎమోషన్స్, యష్‌ స్టయిలీష్‌ యాక్షన్‌ సినిమాని అగ్రపథాన నిలిపాయి. సంచలన విజయాన్ని అందించాయి. 

ఇక ఈ సినిమా తర్వాత యష్‌ నెక్ట్స్ సినిమా ఎంటనేది ఇంకా ప్రకటించలేదు. ఆయన ఎలాంటి సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే నార్తన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఇందులో పూజా హెగ్డేని హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఫైనల్‌ అయ్యిందని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.