Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్లో యష్ ఏది ఏమైనా విన్నీ కీర్తనల జోడి సూపర్ గా ఉంది కరెక్టే కదా అనడంతో అవునవును కానీ హైటే కొంచెం మ్యాచ్ అవ్వడం లేదు అంటుంది వేద. మా విన్నీ సిక్స్ ఫీట్ ఉన్నాడు. కానీ ఈ కీర్తన కొంచెం హైట్ తక్కువగా ఉంది అని అంటుంది వేద. అప్పుడు యష్ ప్రపంచంలో మంచి మంచి జంటలు అందరూ కూడా అబ్బాయి హైట్ గా అమ్మాయి కొంచెం పొట్టిగా ఉన్నారు అలా ఉంటేనే అది బెస్ట్ జంట అవుతుంది అని అంటాడు. అప్పుడు సులోచన అల్లుడు గారు చెప్పింది నిజమే అని అంటుంది.
విన్నీ అమ్మాయిని ఏమైనా అడుగు అనడంతో నేనేమి అడగను నా తరుపున మా ఫ్రెండ్ వేద అడుగుతుంది అని అంటాడు విన్నీ. అప్పుడు ఎవరిని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనకు తానుగా మాట్లాడుతూ ఉండగా వేద రివర్స్లో పంచులు వేసే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. నీకు ఎటువంటి అలవాట్లు లేవు అనడంతో నువ్వు ఊరుకో నాన్న విన్నికి సిగరెట్ అలవాటు ఉంది అప్పుడప్పుడు కొంచెం తాగుతున్న ఉంటాడు అని అబద్ధాలు చెబుతుంది వేద. అప్పుడు యష్, విన్నీ ఇద్దరు బిక్క ముఖం వేస్తారు. అప్పుడు వేద ఎలా అయిన సంబంధం చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.
వేదకి ఏమయ్యింది చూడబోతే ఈ సంబంధం చెడగొట్టాలని కంకణం కట్టుకున్నట్టు ఉంది అని అనుకుంటూ ఉంటాడు యష్. అప్పుడు యష్ అబద్దాలు చెప్పైనా సరే విన్నీ పీడ విరగడ చేసుకోవాలని అనుకుంటూ ఉండగా వేద మధ్యలో అడ్డుపడుతూ ఉండడంతో ఉంటాడు. వేద ఆంటీ కీర్తన నాకు ఎప్పటినుంచో తెలుసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు.. అప్పుడు వేద ఫ్లైట్ ఫిరాయించింది విన్నీ ఆంటీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఈ సంబంధం చేసుకో బాగుంటుంది అనడంతో ఇదేంటి వేద ప్లేట్ ఫిరాయించింది అనుకుంటూ ఉంటాడు.
అందరూ ఓకే అనడంతో సంబంధాలు మాట్లాడుకుందాం అనగా కానీ ఒక విషయం అని అంటుంది వేద. ఆంటీ చీటీలు వేస్తుంది డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉంటుంది అని రాజేశ్వరి గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడంతో యష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏమంటావ్ విన్నీ పోలీస్ కేసున్న ఇంటికి అల్లుడుగా వెళ్లనంటావా అంటూ వేద సంబంధం చెడగొట్టే చేస్తూ ఉంటుంది. అప్పుడు రాజేశ్వరి కోపంతో వేద నీకేమైన మైండ్ పనిచేయడం లేదా, కూతురికి సంబంధం సెట్ చేయాలనుకుంటున్న విడగొట్టాలి అనుకుంటున్నావా నేను నమ్ముకుంటే జీవితంలో నా కూతురికి పెళ్లి కాదు అని అంటుంది.
అప్పుడు వేద మాట్లాడానికి ప్రయత్నించగా ఆపు అని వేద మీద సీరియస్ అవ్వడంతో వెంటనే విన్ని సీరియస్ అవుతూ స్టాపిడ్ నా ముందే మీరు సీరియస్ అవుతారా. అది కాదు బాబు అనగా ఆపండి నాకు వేద అంటే చాలా మంచి గౌరవం ఉంది నా బెస్ట్ ఫ్రెండ్ తనని ఎవరైనా అంటే ఊరుకోను అని రాజేశ్వరి మీద సీరియస్ అవుతాడు విన్నీ. వేద ఏం చేసిన నా మంచి కోసమే చేస్తుంది. నా మేలుకోరి చేస్తుంది అని అంటాడు. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు ఒకవేళ పెళ్లి చేసుకున్న మీ అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోను అని అంటాడు విన్నీ.
అప్పుడు వేదని ఆమె దారుణంగా అవమానించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మాళవికను,అభి ఆఫీసుకి తీసుకొని వెళ్తాడు. అప్పుడు చిత్ర ఈ నీచుడు మాళవికతో సాయం చేయించడానికి తీసుకొని వచ్చాడు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అభి మాళవిక కి మాయమాటలు చెప్పి నిన్ను బిజినెస్ పార్టనరీ చేసుకోవాలి అనుకుంటున్నాను నీకు సగం షేర్ రాసిస్తున్నాను అనడంతో మాళవిక నిజమని నమ్మి సంతోష పడుతూ ఉంటుంది. తర్వాత చిత్ర కాఫీ తీసుకొని వెళ్లి కావాలనే మాళవిక సైన్ చేస్తున్న పేపర్లపై కాఫీ ఒలక బోసి స్వారీ మేడం అని చెబుతుంది.
ఇప్పుడు ఎలా డార్లింగ్ అనడంతో ఏం కాదు నేను ఇంకొక డాక్యుమెంట్స్ రెడీ చేయిస్తాను అంటాడు అభి. మరొకవైపు జరిగిన విషయాలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది. అప్పుడు యష్ వేద మీద సీరియస్ అవుతూ అసలు ఏంటి ఉద్దేశం విన్నీకి అసలు పెళ్లి కాకూడదని అనుకుంటున్నావా అని వేద మీద సీరియస్ అవుతాడు. తప్పు చేసావు వేద అనడంతో నేను కరెక్టే చేశాను మీరే తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అంటుంది వేద. అప్పుడు వేద నేను చెప్పేది వినండి అని జరిగింది మొత్తం యష్ కి వివరిస్తుంది. నేను చెప్పేది వినిపించుకోరు నేను ఎందుకు చేస్తున్నానో ఆలోచించరు నా మీద చిరాకు పడతారు కోప్పడతారు అని బాధగా మాట్లాడుతుంది వేద.
నా మనసుని బాధ పెడుతుంటారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది వేద. అయినా మీ ఆవేశం మీదే కానీ ఎదుటివాళ్ళను ఎప్పుడు అర్థం చేసుకుంటారు అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది వేద. అప్పుడు వేద ముక్కులో నుంచి బ్లడ్ రావడంతో అది చూసి యష్ షాక్ అవుతాడు. అప్పుడు వేదను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా అక్కడ డాక్టర్ లేడు అనడంతో యష్ హాస్పిటల్ యాజమాన్యంపై సీరియస్ అవుతాడు. అప్పుడు విన్నీ టెన్షన్ పడకు నేను డీల్ చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతాడు. అప్పుడు విన్నీ హాస్పిటల్ ఓనర్ తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా మరోవైపు వేదకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు యష్ వేదని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
