Asianet News TeluguAsianet News Telugu

`రామాయణ్‌`లో యష్‌.. అధికారిక ప్రకటన.. హీరోగానే కాదు, మరో బాధ్యత..

రాకింగ్‌ స్టార్‌ యష్‌.. మరో సినిమాని ప్రకటించారు. `రామాయణ్‌`లో ఆయన భాగం కాబోతున్నారు. హీరోగానే కాదు, మరో బాధ్యతలను కూడా తన భుజాలపై ఎత్తుకుంటున్నారు. 
 

yash ramayan movie official confirm he part of production also arj
Author
First Published Apr 12, 2024, 1:57 PM IST

భారతీయ పురాణ, ఇతిహాసాల నుంచి సినిమా ప్రారంభం నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కో భాషలో ఒక్కోలా తెరకెక్కిస్తున్నారు. ఎవరు ఎలా తీసినా ఆయా సినిమాలు చాలా వరకు ఆదరణ పొందుతూనే ఉన్నాయి. ఇటీవల ప్రభాస్‌ హీరోగా `ఆదిపురుష్‌` సినిమా వచ్చింది. కానీ ఇది ఆడలేదు. ఇప్పుడు రామాయణం ఆధారంగా మరో సినిమా రాబోతుంది. `రామాయణ్‌` పేరుతోనే దీన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. పాన్‌ ఇండియన్‌ మూవీగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. పాన్‌ ఇండియా ఆర్టిస్ట్ లు ఇందులో నటిస్తున్నారు. 

నితేష్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో రణ్‌ బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యష్‌ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. రాముడిగా రణ్‌ బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్‌ కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చింది. `రామాయణ్‌` పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. ఇందులో కోలీవుడ్‌ రాకింగ్‌ స్టార్‌ యష్‌ భాగమవుతున్నారు.

యష్‌ ఈ ప్రాజెక్ట్ లో కొత్త బాధ్యతలు చేపడుతున్నారు. ఆయన హీరోగానే కాదు, నిర్మాతగానూ నటిస్తున్నారు. ఇందులో ఆయన రావణుడిగా కనిపిస్తారనే వార్త వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నిర్మాతగానూ మారుతుంది. ఈ ప్రొడక్షన్‌ లో తాను భాగం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్త నమిత్‌ మల్హోత్రాతో కలిసి యష్‌ ఈ మూవీని నిర్మించబోతున్నారు. అందుకోసం ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌తో యష్‌.. మాంస్టర్‌ మైండ్‌ క్రియేషన్స్ చేతులు కలుపుతుంది. ఇందులో విజువల్‌ ఎఫెక్ట్ సంస్థ డీఎన్‌ఈజీ కూడా భాగం కాబోతుంది. ఇది నమిత్‌ మల్హోత్రాదే కావడం విశేషం. 

నితేష్‌ తివారి దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీ గురించి యష్‌ మాట్లాడుతూ, నాకు ఎప్పటి నుండో ఉన్న కల, మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని, నమిత్ నేను రామాయణం చేస్తే  బాగుంటుంది అని చాలా సార్లు అనుకున్నాం, కాని అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలి అంటే అది మామూలు విషయం కాదు, బడ్జెట్స్ కూడా సరిపోవు అందుకే నేను కూడా నిర్మాణంలో భాగం కావాలనుకున్నా. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తాను. నితీష్ తివారి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం అనేది మన జీవితాలకు ముడి పది ఉంటుంది, మనం నమ్ముతున్నాం, మనకి రామాయణం తెలుసు, అందులో జ్ఞానం, భావజాలం ఇలా ఎన్నో లేయర్స్ ఉంటాయి. మా విషన్ ఏంటి అంటే గ్లోబల్ స్టేజి తెరపై ఈ అద్భుతమైన రామయణాన్ని చూపించాలి. అందులో ఉన్న ఎమోషన్స్, వాల్యూస్ అన్ని కూడా, రామాయణం యొక్క జర్నీ ని ప్రపంచం అంతా చూపించాలి` అని తెలిపారు యష్‌. 

నమిత్ మల్హోత్ర మాట్లాడుతూ, యూఎస్‌, యూకే, ఇండియా.. ఇలాంటి దేశాల్లో వ్యాపారాలు చేసి, కమర్షియల్ సక్సెస్ తెచ్చుకుని, ఆస్కార్ వరుకు వెళ్లి, మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలను అని అనిపిస్తుంది. ఎక్కడో కర్ణాటక నుండి ఈరోజు ప్రపంచం గర్వించే `KGF 2` వరుకు, యష్ చాలా కష్టపడ్డాడు. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ను ప్రపంచ వేదిక మీద ప్రెసెంట్ చెయ్యాలి అంటే అది యష్ లాంటి  వారితోనే సాధ్యం` అని చెప్పారు. దీన్నొక విజువల్‌ వండర్‌లాగా తీసుకువస్తున్నామని తెలిపారు. 

`కేజీఎఫ్‌2` తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న యష్‌.. ప్రస్తుతం `టాక్సిక్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతుంది. గీతూ మోహన్‌దాస్‌ దర్శకురాలు. ఆ తర్వాత `రామాయణ్‌`లో ఆయన భాగం కాబోతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios