Asianet News TeluguAsianet News Telugu

`కేజీఎఫ్‌` స్టార్ యష్‌ కొత్త సినిమా `టాక్సిక్‌`లో ఇవి గమనించారా?

`కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. తాజాగా ఆ సినిమా టైటిల్‌ ని ప్రకటించారు. అయితే ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు ఆకట్టుకుంటున్నాయి. 

yash new movie title toxic do you observe this things in title glimpse ? arj
Author
First Published Dec 8, 2023, 12:58 PM IST

`కేజీఎఫ్‌` స్టార్ యష్‌ తన సినిమా వచ్చి ఏడాది గడిచిపోయినా కొత్త సినిమా అప్‌డేట్‌ రాకపోవడంతో అభిమానులంతా నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో లేట్ గా అయినా లేటెస్ట్ గా వచ్చారు. తన కొత్త సినిమాని ప్రకటించారు. ఇటీవల ప్రాజెక్ట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టైటిల్‌ ని ప్రకటించారు. `టాక్సిక్‌` అనే టైటిల్‌ని ప్రకటిస్తూ  గ్లింప్స్ ని విడుదల చేశారు.  దీనికి `ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్స్ అప్స్` అనేది ట్యాగ్‌ లైన్‌. టైటిల్‌, ట్యాగ్‌లైన్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. 

ఈ సినిమాకి ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతుంది. కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్ ని కూడా ప్రకటించారు. `టాక్సిక్‌`ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10, 2025న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జోకర్‌ సింబల్‌ని బాగా ఎస్టాబ్లిష్‌ చేశారు. అది ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

అంతేకాదు ఇందులో యష్‌ పాత్ర గెటప్‌ని సైతం చూపించడం విశేషం. అయితే అది అచ్చు కేజీఎఫ్‌ని దించినట్టుగా ఉంది. `కేజీఎఫ్‌` సినిమాలోని యష్‌ పాత్ర ఐకానిక్‌ గెటప్‌ని తలపించేలా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. `కేజీఎఫ్‌`కి మరో సీక్వెల్‌లా అనిపిస్తుంది. ఇక టైటిల్‌ మాత్రం ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. ఇది కూడా గ్యాంగ్‌ స్టర్‌ మూవీనా అనే సందేహాలకు తెరలేపుతుంది. మొత్తానికి `కేజీఎఫ్‌` తర్వాత యష్‌ ఎలాంటి సినిమాతో వస్తారనే సస్పెన్స్ ఇన్నాళ్లు కొనసాగింది. దానికి ఎట్టకేలకు తెరదించారు.

ఈ సినిమా గురించి దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ మాట్లాడుతూ, కథను సరికొత్తగా చెప్పాలని నేనెప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. `లైయర్స్`, `మూతోన్` వంటి సినిమాలను రూపొందించినప్పుడు వాటికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. మన దేశంలో  ఆడియెన్స్ ఇలాంటి డిఫ‌రెంట్ నెరేష‌న్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటార‌నే విష‌యాన్ని తెలుసుకోవ‌టానికి ఎప్పుడూ త‌హ‌త‌హ‌లాడుతుంటాను. అలాంటి ఆలోచ‌న‌ల నుంచి పుట్టిందే ఈ సినిమా. రెండు వేర్వేరు ప్రపంచాల క‌ల‌యిక‌గా క‌థ ఉంటుంది. ఈ కథకి యష్‌ బాగా యాప్ట్ అవుతాడనిపించింది. త‌నొక అద్భుత‌మైన వ్య‌క్తి. అలాంటి వ్య‌క్తిని ఇప్పటి వరకు చూడ‌లేదు. అత‌నితో క‌లిసి ఈ మ్యాజిక‌ల్ జ‌ర్నీని చేయ‌టానికి ఎంతో ఆతృత‌గా ఉన్నా` అని తెలిపింది.  

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత వెంక‌ట్ కె.నారాయ‌ణ మాట్లాడుతూ , `రాకింగ్ స్టార్ య‌ష్‌తో సినిమా చేయ‌బోతుండ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఇది మాకెంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రం. య‌ష్‌, గీతు స్ట్రాంగ్ నెరేష‌న్‌తో మాస్‌, యాక్ష‌న్ అంశాల‌ను క‌ల‌గ‌లిపిన క‌థ‌ను త‌యారు చేయ‌టానికి ఇంత స‌మ‌యం తీసుకున్నారు. ఈ అద్భుతాన్ని ప్రపంచానికి ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios