Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి గారికి మాట్లాడాల్సిన అవసరం లేదు, భయపడ్డాం

రాజమౌళిగారు ఉన్న స్థాయికి మా సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మా సినిమా గురించి మంచిగా మాట్లాడినప్పుడు భయపడ్డాను. ఆ అంచనాలను అందుకుంటానా? అని. సినిమాపై నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు ఆదరించారు అంటున్నాడు కన్నడ హీరో యశ్. 

Yash Happy with KGF movie Sucess
Author
Hyderabad, First Published Dec 28, 2018, 10:09 AM IST

రాజమౌళిగారు ఉన్న స్థాయికి మా సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మా సినిమా గురించి మంచిగా మాట్లాడినప్పుడు భయపడ్డాను. ఆ అంచనాలను అందుకుంటానా? అని. సినిమాపై నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు ఆదరించారు అంటున్నాడు కన్నడ హీరో యశ్. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌). శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదలైంది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో అనువదించి, విడుదల చేశారు. గురువారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో యశ్‌ మాట్లాడుతూ ఇలా స్పందించారు. 

యశ్ మాట్లాడుతూ.... ‘‘ఒక సినిమాకు మంచి పొజిషన్‌ దొరక్కపోతే ఆడియన్స్‌కు రీచ్‌ అవ్వదు. ఆ పనిని బాగా చేసిన సాయికొర్రపాటి అన్నకు ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమా సక్సెస్‌ నా ఒక్కడిదే కాదు. టీమ్‌ అందరిదీ. తెలుగు హీరోల సినిమాలు చూసి నేను మరింత బాగా తెలుగు నేర్చుకుంటాను. కేజీఎఫ్‌ రెండో పార్ట్‌ మరింత బాగా రావడానికి కష్టపడతాను’’ అన్నారు.

అలాగే ‘‘రాజ్‌కుమార్‌గారు అభిమానులు దేవుళ్లు అనేవారు. ఆ విషయం నాకు మళ్లీ గుర్తొచ్చింది. నేను ఎవరికీ తెలీదు. నా సినిమాను చూసి నాకు వెల్‌కమ్‌ చెప్పిన తెలుగు ప్రేక్షకులు దేవుళ్లు. పదేళ్ల క్రితం నా వర్క్‌ని చూసి కన్నడ ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు తెలుగువారు సపోర్ట్‌ చేశారు. తెలుగు కాంప్లిమెంట్స్‌ స్పెషల్‌గా ఉంటాయి. ఒకచోట ‘అన్నా నువ్వు ఊర మాస్‌’  అని ఎమోషనల్ గా చెప్పాడు. 

ఇక ‘‘వందకోట్ల సినిమాలను చేసే సత్తా అన్ని ఇండస్ట్రీలకు ఉంటుంది. ప్రేక్షకులు పెరిగారు. కన్నడ ఇండస్ట్రీ చిన్నదంటే నాకు కోపం వస్తుంది. బాధగా ఉంటుంది. సినిమా కలెక్షన్స్‌ గురించి నిర్మాతలను నేను అడగను. పార్కింగ్‌ క్రౌడ్‌ని మాత్రమే చూస్తాను. నా సినిమా చూసి ఆడియన్స్‌ హ్యాపీ అంటే అదే నా విజయంగా ఫీల్‌ అవుతాను’’ అన్నారు నటుడు యశ్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios