కెజిఎఫ్ 2 ప్రమోషనల్ ఈవెంట్ హైదరాబాద్ లో ముగిసింది. ఈ కార్యక్రమంలో హీరో యష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రాజమౌళి గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
ఏప్రిల్ 14న కెజిఎఫ్ 2(KGF Chapter 2) ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ భారీగా నిర్వహించారు. కొచ్చిన్, చెన్నై, ముంబైలో పాటు వైజాగ్, హైదరాబాద్ నగరాల్లో కెజిఎఫ్ 2 టీమ్ సందడి చేశారు. హైదరాబాద్ ఈవెంట్ తో కెజిఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్స్ ముగిసినట్లే. ఈ ఈవెంట్లో యష్ దాదాపు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. తెలుగు సినిమాను గొప్పగా వర్ణించిన యష్ ఇక్కడి ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం అద్భుతం అన్నారు. అందుకే ఒక స్ట్రెయిట్ మూవీ మాదిరి కెజిఎఫ్ 2 విడుదల అవుతుందన్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) గురించి మాట్లాడుతూ... కెజిఎఫ్ పూర్తిగా ఆయన ఊహా ప్రపంచం, ఆయన క్రియేటివిటీ. ప్రశాంత్ కారణంగా తనకు ఈ స్థాయి స్టార్డం ప్రేక్షకుల ప్రేమ దక్కాయని యష్ ఆయనను పొగడ్తలతో ముంచెత్తాడు. నిర్మాతలతో పాటు హీరోయిన్ శ్రీనిధి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక డెబ్యూ హీరోయిన్ ఒక్క ప్రాజెక్టు కోసం ఇన్ని సంవత్సరాలు డెడికేషన్ పని చేయడం గొప్ప విషయమన్నారు. అందులో ఫస్ట్ పార్ట్ లో ఆమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదని తెలిసి కూడా, సెకండ్ పార్ట్ కోసం వేచి చూసి సినిమా చేశారు. ఆమెతో భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నట్లు యష్ తెలిపారు.
నిర్మాత దిల్ రాజును సైతం యష్ గొప్పగా పొగిడారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గానే కాకుండా సినిమా గురించి ఆయనకు ప్రతి చిన్న విషయం తెలుసు. నిర్మాత అంటే డబ్బులు పెట్టడం మాత్రమే కాదు,క్రియేటివిటీ కూడా అని ఆయన ద్వారా తెలుసుకోవాలన్నారు. ఇక రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని అద్భుతమన్నారు.
ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ... ఆయన కేవలం దర్శకుడు కాదు, ఒక కాంట్రాక్టర్ అన్నారు. పాన్ ఇండియా సినిమాకు మార్గం వేసిన దర్శకుడు అన్నారు. మనం ఇంత పెద్దగా ఆలోచించడానికి, భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి రాజమౌళి గారే స్ఫూర్తి అన్నారు. ఫైనల్ గా సినిమా గురించి మాట్లాడుతూ... చాలా కస్టపడి చేశాము. ఇది ఒక తల్లీ కొడుకు కథ. సినిమా చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారని యష్ తన స్పీచ్ ముగించారు. తన ప్రసంగంలో యష్(Yash) నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్, తన టీమ్ ని ప్రత్యేకంగా పొగిడారు.
మరోవైపు రాజమౌళి (Rajamouli)పై కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.... ''చిన్న గల్లీ లాంటి పాన్ ఇండియా సినిమాని.. ఎనిమిది రోడ్ల హైవేగా మార్చేశారు రాజమౌళి. ఆయన డైరెక్టర్ కాదు.. కాంట్రాక్టర్… దక్షిణాది సినిమాకి ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆయనే కారణం. ఆయనే అతి పెద్ద స్ఫూర్తి'' అంటూ కితాబు ఇచ్చాడు. కేజీఎఫ్‌లో పెద్దగా స్టార్లు లేరు. కానీ… పార్ట్ 2లో మాత్రం సంజయ్ దత్, రవీనా టాంటడన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి వాళ్లని నింపేశాడు. దీనిపై కూడా ప్రశాంత్ నీల్ స్పందించాడు. ''వాళ్లు స్టార్లే కావొచ్చు. కానీ… నాకు మాత్రం పాత్రలు. పాత్రలకు అనుగుణంగానే వాళ్లని ఎంచుకున్నా'' అని అన్నారు.
