భార్య భర్తలు గొడవపడుతుంటారు.. కలసిపోతుంటారు. మేము కూడా అంతే. ఆ రోజు వేదికపై చిరంజీవి గారు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చిన్న భయం ఉండేది. కానీ ఆయన కళ్ళల్లో ప్రేమ కనిపించింది అని యండమూరి అన్నారు.
లెజెండ్రీ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గురించి పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో ఆయనకి ఒకప్పుడు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు గొడవలు జరిగాయి. దీనితో చాలా కాలంగా వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించిన సంగతి తెలిసిందే.
ఇద్దరూ చక్కగా మాట్లాడుకోవడమే కాదు.. తన బయోగ్రఫీ(జీవిత చరిత్ర)ని రాసే బాధ్యత యండమూరి గారికి అప్పగిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించి షాకిచ్చారు. దీనిపై యండమూరి తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ఆ మాట చిరంజీవిని తానె అడిగినట్లు యండమూరి అన్నారు.
యండమూరి రచించిన అభిలాష, ఛాలెంజ్ లాంటి నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాల్లో చిరు నటించారు. కొన్నేళ్ల క్రితం యండమూరి మెగా ఫ్యామిలీతో తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపై పాత మనస్పర్థలని పక్కన పెట్టి ఒక్కటయ్యారు. యండమూరి మాట్లాడుతూ.. మా మధ్య వచ్చిన గొడవలు భార్య భర్తల మధ్య గొడవల్లాంటివే.
భార్య భర్తలు గొడవపడుతుంటారు.. కలసిపోతుంటారు. మేము కూడా అంతే. ఆ రోజు వేదికపై చిరంజీవి గారు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చిన్న భయం ఉండేది. కానీ ఆయన కళ్ళల్లో ప్రేమ కనిపించింది అని యండమూరి అన్నారు. మీ జీవిత చరిత్ర రాస్తే బావుంటుంది అని నేనే ఆయనతో అన్నాను. అవునా మీరు రాస్తే అంతకంటే కావలసింది ఏముంది అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని యండమూరి అన్నారు.