డబ్ల్యూడబ్ల్యూఈ  అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరు. అందులో ఎక్కువ హైట్ గల రెస్ట్లెర్ ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెస్ట్లెర్ వరల్డ్ లో ఇండియాకు గుర్తింపు తెచ్చిన సూపర్‌ స్టార్ ద గ్రేట్‌ ఖలీ అప్పుడపుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నాడు. ఇక మన తెలుగు తెరపై కూడా ఈ WWE కస్టార్ నటించడానికి సిద్దమయ్యాడు. 

ప్రేమించుకుందాం రా - బావగారు బాగున్నారా - శంకర్ దాదా MBBS వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నరేంద్ర. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో  ఖలీ స్పెషల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో హాలీవుడ్ బాలీవుడ్ లోనే కాకుండా అమెరికన్ రియాలిటీ షోల్లో కూడా  ఖలీ  కనిపించాడు. 

హిందీ బిగ్ బాస్ సీజన్ 4లో కూడా ఈ బలవంతుడు కంటెస్టెంట్ గా ఉన్నాడు. ఇక ఫైనల్ గా తెలుగు సినిమాలో కూడా మొదటి అడుగు వేయడానికి సిద్ధం అయ్యాడు. మరి అతను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. నీలేష్ అనే యువకుడు ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు.