వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ మూవీతో డింపుల్ హయాతీ (Dimpla Hayathi) కి తెగ పాపులారిటీ వచ్చింది. అప్పటి నుంచి తన క్రేజ్ ను పెంచుకుంటూనే పోతోంది. అయితే తనలాగే ఒక వ్యక్తి పలువురికి రాంగ్ కాల్స్ చేస్తున్నాడని తెలిపింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మాస్ మహారాజ రవితేజ(Ravi Teja) నటించిన ‘ఖిలాడి’ చిత్రంలో మెరిసింది డింపుల్ హయాతీ. 19 ఏండ్లకే టాలీవుడ్ లో ‘గల్ఫ్’ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిందీ సుందరి. అయితే పలు సినిమాల్లో నటిస్తున్నా పెద్దగా డింపుల్ హయాతీకి గుర్తింపు రాలేదు. దీంతో తన కేరీర్ ను గాడిన పెట్టేందుకు గ్లామర్ షోకు తెరలేపింది. స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) నటించిన గద్దలకొండ గణేష్ మూవీలో డింపుల్ హయాతీ స్పెషల్ సాంగ్ లో నటించిన మాస్ గాళ్ల మనస్సులను కొల్లగొట్టింది.
ఆ తర్వాత యురేఖ మూవీలోనూ నటించింది. కానీ పెద్దగా ఆశించినంత ఫేమ్ రాలేదు. ప్రస్తుతం రవితేజ నటించిన ‘ఖిలాడీ’లో మాస్ మహారాజా సరసన నటించి మెప్పించింది. తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేంది. ప్రస్తుతం అంతో ఇంతో ‘డింపుల్ హయాతీ’కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే తనలాగే ఒక అపరిచితుడు పలువురుకి ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్టు తెలిపింది. ఆ నంబర్ ను కూడా తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
గుర్తు తెలియని వ్యక్తి తనను అనుకరిస్తున్నాడని, ఎవరూ మోసపోకూడదని పేర్కొంది. తను తెలిపిన నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేసి... ఫిర్యాదుచేయాలని తన పరిశ్రమ స్నేహితులకు విజ్ఞప్తి చేసింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ.. అలాంటి కాల్స్ కు రెస్పాండ్ కాకూడదని పేర్కొంది. ‘అబ్బాయిలకు కూడా ఆ అపరిచితుడు నాలాగే నటిస్తూ మెసేజ్‌లు పంపుతున్నాడు. దయచేసి స్పందించకండి.. ఈ మూర్ఖుడిని వెంటనే బ్లాక్ చేయండి’ అంటూ సూచించింది.
