పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే రిజల్ట్ తరువాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే రిజల్ట్ తరువాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తోంది. అసలు పవన్ సినిమాల్లోకి వస్తారా లేదా అనేది ఇంకా సందేహంగానే ఉంది. 

అయితే పవన్ సినిమా చేద్దాం అనే ఆలోచనలోకి వస్తే పలువురు రచయితలు కథలను చెప్పడానికి రెడీగా ఉన్నారట. ఇప్పటికే కొంత మంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి క్యూలో నిలబడ్డారు. పవన్ ఒక్క మాట చెబితే చాలు సినిమాను వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మైత్రి మూవీ మేకర్స్ అలాగే మరికొంత మంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. 

అజ్ఞాత వాసి తరువాత పలు రీమేక్ లలో పవన్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అబద్దాలే అని ముందుగానే పవన్ క్లారిటీ ఇచ్చాడు. రాజకీయాల్లో ఇన్ని రోజులు బిజీగా పాల్గొన్న పవన్ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చే ఆలోచన్లో ఉన్నారా? లేరా? అన్నది తెలియదు గని పవన్ కోసం స్క్రిప్ట్ లు మాత్రం రెడీగా ఉన్నాయని సమాచారం. మరి పవర్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.