ఇండియాలోనే అతిపెద్ద రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఆయన కుమారుడు రాజమౌళి చిత్రాలకు దాదాపు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు. బాహుబలి సిరీస్ కథను కూడా విజయేంద్ర ప్రసాద్ రాశారు. ఈ కథ ఎలా మొదలైందో చెప్పి విజయేంద్ర ప్రసాద్ షాకిచ్చాడు.  

బాహుబలి ఇండియన్ సినిమా ముఖ చిత్రం మార్చేసింది. ఈ ఫ్రాంచైసీ లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. బాహుబలి 2 ఇప్పటికీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. పాన్ ఇండియా కాన్సెప్ట్ బాహుబలి చిత్రాలతో తెరపైకి వచ్చింది. కథలో దమ్ము ఉంటే భాషా భేదాలు లేకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని తెలిసొచ్చింది. 

కాగా బాహుబలి కథకు బీజం ఎలా పడిందో రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అలాగే కట్టప్ప పాత్రకు ముందుగా ఎవరిని అనుకున్నారో కూడా వెల్లడించారు. ఒకరోజు ప్రభాస్ కోసం కథ కావాలి. అది స్త్రీ, పురుషులకు సమాన ప్రాధాన్యత ఉన్న యాక్షన్ సబ్జెక్టు కావాలని రాజమౌళి చెప్పాడట. అప్పుడు విజయేంద్ర ప్రసాద్ కట్టప్ప పాత్రను పరిచయం చేశాడట. కత్తిసాములో యోధుడైన ఒక వృద్ధుడు యువకులకు నేర్పుతుంటాడు. అతని వద్దకు ఒక విదేశీయుడు వస్తాడు. 

మాటల మధ్యలో బాహుబలి ప్రస్తావన వస్తుంది. బాహుబలి చేతిలో కత్తి ఉన్నంత వరకు అతన్ని ఎవరూ చంపలేరని విదేశీయుడికి వృద్ధుడు చెబుతాడు. ఆ వీరుడిని కలవాలని విదేశీయుడు ఆశపడతారు. ఆ వీరుడు ఇప్పుడు బ్రతికి లేడని వృద్ధుడు చెబుతాడు. అతను ఎలా చనిపోయాడు విదేశీయుడు అడగ్గా... ఆయుధం కంటే పదునైనది వెన్నుపోటు. అతన్ని నేనే చంపాను, అని చెబుతాడు. పసి బిడ్డను తీసుకుని ఒక మహిళ నదీ ప్రాంతంలో తిరుగుతుంటుంది... అని రాజమౌళికి విజయేంద్ర ప్రసాద్ చెప్పారట. 

ఈ సన్నివేశాల ఆధారంగా కథ రాయమని రాజమౌళి కోరాడట. కట్టప్ప పాత్ర సంజయ్ దత్ ని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది. కానీ ఆయన చేయడం కుదర్లేదు. దాంతో సత్య రాజ్ ని ఎంచుకున్నాము... అని విజయేంద్ర వర్మ ఆనాటి విషయాలు వెల్లడించారు. విజయేంద్ర ప్రసాద్ మాటలను బట్టి చూస్తే... అసలు బాహుబలి కథ కట్టప్ప పాత్ర ఆధారంగా అల్లారని అర్థం అవుతుంది. ప్రభాస్, రానాలతో పాటు సత్యరాజ్ ఆ పాత్ర కారణంగా చాలా ఫేమస్ అయ్యాడు.