నారా రోహిత్‌ హీరోగా `శ్రీమంతుడు` స్టోరీతో సినిమా.. రైటర్‌ శరత్‌ చంద్ర ప్లాన్‌.. ఏం జరిగింది?

`చచ్చేంత ప్రేమ` నవల నుంచి కాపీ కొట్టారని రైటర్‌ శరత్‌ చంద్ర ఆరోపిస్తున్నారు. కథ పరంగానూ సిమిలారిటీస్‌ ఉన్నాయని రైటర్స్ తేల్చారు. తాజాగా మరో ఆసక్తికర విషయం వెల్లడించారు.

writer Sarath Chandra movie plan with srimanthudu story hero nara rohith but what happened? arj

`శ్రీమంతుడు` స్టోరీ వివాదం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. సినిమా వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు అవుతున్నా, స్టోరీ వివాదం నడుస్తూనే ఉంది. అప్పట్లో హడావుడి జరిగింది. మధ్యలో సైలెంట్‌ అయ్యి ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల కోర్టు దర్శకుడు కొరటాల శివపై ఘాటుగా రియాక్ట్ కావడం, ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలనే ఆదేశాలివ్వడం వంటి వాటితో ఈ వివాదం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఈ సినిమాని `చచ్చేంత ప్రేమ` నవల నుంచి కాపీ కొట్టారని రైటర్‌ శరత్‌ చంద్ర ఆరోపిస్తున్నారు. కథ పరంగానూ సిమిలారిటీస్‌ ఉన్నాయని రైటర్స్ తేల్చారు. దీంతో `శ్రీమంతుడు` స్టోరీ.. `చచ్చేంత ప్రేమ` నవల నుంచే తీసుకున్నారనేది స్పష్టమవుతుంది. అయితే ఈ స్టోరీతో రైటర్‌ సినిమా చేయాలనుకున్నారట. దీనిపై అప్పట్లో నిర్మాతలు, హీరోలను కూడా సెట్‌ చేసుకున్నారట. అప్పట్లో ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న దాసరి నారాయణ రావు వద్దకు కూడా ఈ విషయం వెళ్లిందట. 

నారా రోహిత్‌ హీరోగా సినిమా నిర్మించాలని తాను ప్లాన్‌ చేసినట్టు చెప్పారు రైటర్‌ శరత్‌ చంద్ర. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా స్టార్ట్ చేశామని, ఈ క్రమంలోనే `శ్రీమంతుడు` మూవీ విడుదలైందన్నారు. అది చూసి తాము ఆశ్చర్యానికి గురయ్యామని, దీంతో కథ శౌర్యం కింద కేసు వేసినట్టు తెలిపారు రైటర్‌. మొదట దీనిపై సెటిల్మెంట్‌కి పిలిచారని, తాను ఒప్పుకోలేదన్నారు. మరోవైపు హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నారు, దానిపై కోర్ట్ ద్వారా నోటీసులు పంపించామని దీంతో అది ఆగిపోయిందన్నారు. 

అలాగే తన వద్ద ఉన్న మరో నవలతో సినిమా చేయాలని, దానికి తన పేరు వేయాలని తాను చెప్పగా, దాన్ని రిజెక్ట్ చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా మహేష్‌ బాబు ప్రొడక్షన్‌ పేరు మార్పు, నమ్రత ఇన్‌వాల్వ్ మెంట్‌, ప్రొడక్షన్‌ హౌజ్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ రియాక్షన్‌, తర్వాత మహేష్‌ ని ఈ ప్రొడక్షన్‌ నుంచి తప్పించడం వంటివి జరిగాయని తెలిపారు. తాను ఈ వివాదాన్ని వదిలే ప్రస్తక్తి లేదని ఆయన వెల్లడించడం గమనార్హం. మరి `శ్రీమంతుడు` టీమ్‌, దర్శకుడు కొరటాల శివ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ.. ఎన్టీఆర్‌ హీరోగా `దేవర` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రెండు భాగాలుగా ఈ మూవీ విడుదల కానుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సిన ఈ మూవీని వాయిదా వేస్తున్నారు. ఆగస్ట్ లోగానీ, దసరాకిగానీ విడుదల చేయబోతున్నారట. 

Read more: `కల్కి2898ఏడీ` వాయిదా?.. కారణమేంటి? నిజం ఏంటి?.. కొత్త డేట్‌ ఎప్పుడంటే?
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios