పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు... టాలీవుడ్ సీనియర్ రచయిత, నటుడు పరుచూరి గోపాల కృష్ణ. పవన్ కళ్యాణ్ కుసమాజాన్నిమార్చాలన్న తపన ఉందంటున్నారు పరుచూరి.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు టాలీవుడ్ స్టార్ రైటర్ పరుచూరి గోపాల కృష్ణ. పవన్ కళ్యాణ్ స్పీచ్ లతో పాటు.. ఆయన కెరీర్ కు సబంధించి వ్యాక్యలు చేశారు. సమాజాం మారాన్న ఆకాంక్ష పవర్ కళ్యాణ్ లో కనిపించిందని.. పరుచూరి వ్యాఖ్యానించారు. పవన్ వ్యాక్తిగతం సినిమా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాక్యలపై తాజాగాస్పందించారు పరుచూరి గోపాల కృష్ణ. సమాజంలో మార్పు రావాలని పవర్ మనస్పూర్తిగా కోరకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. 

అంతే కాదు సమాజం మారాలంటే..అధికారం అప్పుడప్పుడు చేతులు మారుతూ ఉండాలి..అది ఒక్కరి ఆధిపత్యంలోకి వెళ్ళకూడదు అన్నారు. అయితే గత ఎన్నికల్లో ప్రయత్నం చైసి ఓడిపోయినా.. మళ్ళీ దెబ్బతిన్న పులిలా మన ముందుకు వస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పట్టుదలతో ఈసారి ఏదైనా సాధించాలని చూస్తున్నాడు అని అన్నారు. 

పాలిటిక్స్ లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి.. వాటిని లెక్క చేయకుండా ముందు సాగాలి.. ఓటింగ్ అనేది పెద్ద రాజకీయం తంత్రం. సమాజం గురించి రాజకీయ నాయుడు చెపితే వినేవారికంటే.. సినిమా వాళ్లు చెపితేనే వినేవారు ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ అంటే మొదటి నుంచీ తనకు ఎంతో ఇష్టం అన్నారు . 

పవన్ కళ్యాణ్ బాగుండదాలి అని కోరుకునే వ్యాక్తుల్లో తాను ముంద వరుసలో ఉంటాను అన్నారు పరుచూరి కోపాలకృష్ణ. ఇక పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ సినిమాలు మానేయవద్దని అన్నారు. సినిమాలు రెగ్యూలర్ గా చేయడం ఇబ్బందిగా ఉన్నా.. ఎన్టీఆర్ మాదిరి అప్పుడప్పుడు అయినా సినిమాలు చేయాలని ఆయన అన్నారు. అంతే కాదు పవన్ అంటే తనకు ఎంతో ఇష్టం అని.. పవన్ కోరుకున్నది జరగాలని ఆయన ఆకాంక్షిచారు.