సదరు నిర్మాణ సంస్థ ఇప్పుడు లీగల్ గా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరో ప్రక్క ‘బరేలీ కి బర్ఫీ’ నిర్మాతలు సైతం...ఈ సినిమా చూసారని ,
సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా చేయగా రోహిణి, ఆశిష్ విద్యార్ధి సుహాస్ అమ్మానాన్నలుగా చేసి మెప్పించారు. రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. కామెడీ, ఎమోషనల్, అమ్మ సెంటిమెంట్ ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. సినిమా ప్రమోషన్స్ కూడా సరికొత్తగా చేశారు చిత్రయూనిట్.
సినిమాకి ఆదరణ పెంచడానికి ఉమెన్స్ కి స్పెషల్ గా ఒక రోజంతా పలు థియేటర్స్ లో ఫ్రీ షోలు వేశారు. దీంతో చిన్న సినిమాగా రిలీజయిన రైటర్ పద్మభూషణ్ ఇప్పుడు పెద్ద హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాకి పేరుతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. అయితే అదే సమయంలో ఈ సినిమా ఓ హిట్ హిందీ సినిమా కాపీ వివాదం ఏమైందంటూ సోషల్ మీడియాలో చర్చగా మారింది.
బాలీవుడ్‌లో వచ్చిన ‘బరేలీ కి బర్ఫీ’ అనే సినిమా కు ఈ సినిమాకు బాగా పోలికలు ఉన్నాయి.ఈ హిందీ సినిమా రీమేక్ హక్కులను ఒక తెలుగు ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేసిందని, వారు ఇప్పుడు తమ దగ్గర ఉన్న రైట్స్ ని ఏం చేయాలి అనే టెన్షన్ లో ఉన్నట్లు చెప్తున్నారు. సదరు నిర్మాణ సంస్థ ఇప్పుడు లీగల్ గా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరో ప్రక్క ‘బరేలీ కి బర్ఫీ’ నిర్మాతలు సైతం...ఈ సినిమా చూసారని , ‘రైటర్ భూషణ్’ సినిమా కథలో మూల విషయం, కొన్ని సీన్లు మా సినిమాతో కలుస్తున్నాయి. మూల కథని కాస్త అటు ఇటు మార్చారు. కానీ అసలు పాయింట్ మాత్రం అదే అని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరి ఈ విషయమై ఇప్పటిదాకా అఫీషియల్ గా రైటర్ పద్మ భూషణ్ టీమ్ స్పందించలేదు. కానీ లోపాయకారీగా ఏమన్నా సెటిల్మెంట్స్ జరుగుతున్నాయా ఏమిటినేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాని అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు. రైటర్ పద్మభూషణ్ సినిమా మొదటి రోజు నుంచి కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మొదటి వారంలోనే 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళింది. తాజాగా రైటర్ పద్మభూషణ్ సినిమా 10 రోజుల్లోనే 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ లోకి వెళ్ళింది. ఇక అమెరికాలో కూడా 300K డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసింది. మరో మూడు రోజుల వరకు కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
