Asianet News TeluguAsianet News Telugu

చిచీ... నగ్నంగా వున్నప్పుడు మర్మాంగంపై కీరవాణి ఓంకారం సంగీతం

  • గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ కు కీరవాణి సంగీతం
  • ఓంకారం ఒక సెక్స్ మూవీకి వాడటంపై అభ్యంతరం
  • ఆరెసెస్ తోపాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్న రచయిత జయకుమార్
Writer Jayakumar on keeravani music for god sex truth

సంచలనం ఎక్కడుంటే అక్కడ కనిపించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన లఘు చిత్రం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ). ఈ సినిమా కథ  తనదేనంటూ గత కొంతకాలంగా ఆందోళన చేసిన రచయిత జయకుమార్ తాజాగా ఆ చిత్ర సంగీతంపై విమర్శలు సంధించారు. ఈ సినిమాలో పోర్న్ స్టార్ మియా మాల్కోవా నగ్నంగా మర్మాంగంపై ఓంకారం ప్లే చేయడం చాలా దారుణం. శ్రీ రామదాసు, అన్నమయ్య, షిర్డి సాయిబాబా లాంటి చిత్రాలకు కీరవాణి సంగీతం అందించారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. డబ్బు కోసం పోర్న్ సినిమాలో నటించే మియా మాల్కోవా చిత్రానికి కీరవాణి సంగీతం అన్యాయం అందించడం చాలా బాధాకరం.

Writer Jayakumar on keeravani music for god sex truth

సాధారణంగా ఓంకారం అనేది చాలా పవిత్రం. శివుడి గుడికి వెళ్తుంటాం. అలాంటి పవిత్రమైన ఓంకారాన్ని మియా మర్మాంగంపై చూపించారు. మనం గుడికి వెళ్లినప్పుడు మియా మాల్కోవా లాంటి సన్నివేశాలు గుర్తుకు వస్తే ఎంత దారుణంగా ఉంటుందో తలచుకొంటేనే బాధగా ఉంది. కీరవాణి దారుణంగా భక్తికి సంబంధించిన మ్యూజిక్‌ను సెక్స్ కోసం వాడుకోవడం చాలా దారుణం. కీరవాణి మ్యూజిక్‌ను ప్రశంసిస్తూ వర్మ ట్వీట్ చేయడం కూడా అన్యాయం. నా మ్యూజిక్‌ను వర్మ ఎలివేట్ చేయడం, కీరవాణి చెప్పుకోవడం దారుణం అని జయకుమార్ అన్నారు. జీఎస్టీ ఓపెనింగ్ షాట్‌లోనే ఓంకారం వినిపిస్తుంది. అది ఓంకారం కాదు అని అబద్దాలు అడే అవకాశం ఉంది. కచ్చితంగా అది ఓంకారమే అనేది స్పష్టం. జీఎస్టీకి కీరవాణి ఎక్కడ మ్యూజిక్ కొట్టారని అనేది చాలా ముఖ్యం.

 

సెక్స్ మూవీని తీసి ఓ కళాత్మక చిత్రం అని చెప్పుకోవడం ఇంకా దారుణమే. ఈ చిత్రాన్ని దేశం మొత్తం అసహ్యించుకొంటోంది. అలాంటి చిత్రంపై పొగడ్తలు దారుణం. ఇలాంటి వారిని వదిలేస్తే మియా మాల్కోవాకు గుడి కడతారు. జీఎస్టీ సినిమాను యూరప్‌లో తీశానని వర్మ చెబుతున్నారు. అలాంటి సినిమాకు కీరవాణి ఎక్కడ మ్యూజిక్ కొట్టాడు? కొడితే తన ఇంట్లో నాలుగు గోడల మధ్య కొట్టాడా? లేక ప్రొడక్షన్ హౌస్‌లో కొట్టాడా అనే విషయంపై కీరవాణి క్లారిటీ ఇవ్వాలి అని జయకుమార్ డిమాండ్ చేశారు.

 

నేను అందించిన స్క్రిప్టును వర్మ వాడుకోవడాన్ని పక్కన పెడితే.. వర్మ, కీరవాణి హిందూ మతానికి సంబంధించిన మనోభావాలను కించపరిచాడు. వీళ్లకు సరైన బుద్ది చెప్పాల్సిందే. నేను విశ్వహిందూ పరిషత్‌ను సంప్రదిస్తాను. పోలీసులకు కూడా సమాచారం అందిస్తున్నాను. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తాను. సంప్రదాయాలకు విరుద్ధంగా ఓంకార నాదాన్ని సెక్స్‌ కు వాడటం, హిందూ సంప్రదాయాలను దెబ్బ తీశాడనేది నా ఆరోపణ. వారిని వదిలేస్తే మియా మాల్కోవా దేవత అంటారు. ఆమెకు గుడి కట్టినా కడుతారు. ఐటీ చట్టం ప్రకారం ఇవన్నీ నేరమే అనే అభిప్రాయాన్ని సినీ రచయిత జయకుమార్ వ్యక్తం చేశారు.

జీఎస్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతుండటంతో దానికి సంబంధించిన కొందరు నాతో మాట్లాడారు. ఆ సినిమా ఎక్కడ తీశారు? ఎక్కడ మ్యూజిక్ అందించారని చెప్పారు. అంతేకాకుండా కొందరు దీనిని వివాదం చేయవద్దని కూడా సూచించారు అని జయకుమార్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios