కొన్ని సినిమాలు ధియోటర్స్ లో చూడాలని జనం రిలీజ్ కు ముందు ఫిక్స్ అవుతారు. 

కొన్ని సినిమాలు ధియోటర్స్ లో చూడాలని జనం రిలీజ్ కు ముందు ఫిక్స్ అవుతారు. అయితే టాక్ యావరేజ్ గా ఉండటమో , టిక్కెట్లు దొరక్క..తర్వాత చూద్దామని వాయిదా వేసుకోవటమో, ఫ్యామిలీ అంతా వెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుందని ఆగటమో చేస్తారు. అయితే ఆ సినిమా చూడాలనే కోరిక తీరదు. అప్పుడు వాళ్లు టీవీల్లోనో లేక అమెజాన్ ప్రైన్ లోనో ఆ సినిమా వచ్చే దాకా వెయిట్ చేస్తారు. అప్పుడు టీఆర్పీలు అదిరిపోతాయి. ఇప్పుడు 2.0 సినిమాకు అదే జరగబోతోందంటున్నారు. 

మొన్న సంక్రాంతి బరిలో సినిమాలన్నీ బుల్లితెరతో పాటు అమెజాన్ లోనూ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే సంక్రాంతి ముందు రిలీజైన 2.0 మాత్రం ఇప్పటిదాకా టీవిల్లో రాలేదు. దీంతో ఈ సినిమా కోసం ఓ వర్గం.. ఎంతో ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తోంది. ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసింది. 

జీ తెలుగు నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం 2.0 చిత్రాన్ని ఈ నెల 13న జీ తెలుగు చానెల్ టెలీకాస్ట్ చేయనుంది. ఈ మేరకు వారి ఫేస్ బుక్ పేజీలో అఫీషియల్ గా ప్రకటన చేసింది. అంటే ఆ రోజు సాయంత్రం 5.30కు టీవీలకు రజనీ అభిమానులే కాదు 2.0 చూద్దామనుకున్నవాళ్లు, మళ్లీ చూద్దాం అని ఫిక్సైన వాళ్లు అతుక్కపోతారనటంలో సందేహం లేదు. 

వాస్తవానికి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా అనుకున్న స్దాయి విజయం సాధించలేదు. 3డిలోనే చూడాలి అంటూ చేసిన ప్రచారం సినిమాకు పెద్ద దెబ్బ కొట్టింది. అందుకే అప్పుడు చూడని వాళ్లు ఇప్పుడు టీవీల్లో చూసేందుకు ఆసక్తి చూపిస్తారని అంతా భావిస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ లు అసాధారణంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. 

రజనీకాంత్ , ఎమీజాక్సన్, అక్షయ్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు.