Asianet News TeluguAsianet News Telugu

World of UI : ‘వరల్డ్ ఆఫ్ UI’ చూశారా?.. ఉపేంద్ర సినిమాపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు!

కన్నడ స్టార్ ఉపేంద్ర Upendra నుంచి సరికొత్త సినిమా రాబోతోంది. తాజాగా ఆ చిత్రం నుంచి World of UI Teaser ను విడుదల చేశారు. చీఫ్ గెస్ట్ గా హాజరైన అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

World of UI released from Kannada Star Upendras UI movie NSK
Author
First Published Jan 8, 2024, 5:24 PM IST

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇప్పటికీ విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. రోటీన్ కు భిన్నంగానూ, ఆలోచింపజేసే చిత్రాలతో ఉపేంద్ర చాలా క్రేజ్ దక్కించుకున్నారు. ఇండస్ట్రీలో తనదైన శైలిని ప్రదర్శించారు. దాంతో తనకు అన్నీ భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలకూ మార్కెట్ ఉంది. 

గతంలో ఉపేంద్ర నటించిన ఓం, ఏ, ఉపేంద్ర, ఉప్పి 2, సూపర్ వంటి సినిమాలతో ఎంతలా ప్రభావం చూపారో తెలిసిందే. అలాగే తెలుగులోని కొన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లోనూ ప్రధాన పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. చివరిగా ఉపేంద్ర ‘కబ్జా’ మూవీతో వచ్చారు. ప్రస్తుతం ఆయన నుంచి సరికొత్త సినిమా రాబోతోంది. 

అదే ‘యూఐ’ UI. ఈ చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేసి నటించడం విశేషం. ప్రస్తుతం సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండటంతో ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బెంగళూరులో ఈవెంట్ నిర్వహించి సినిమాకు సంబంధించిన World of UI వీడియోను లాంచ్ చేశారు. ఈ గ్లింప్స్ ను కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ Kiccha Sudeepa రిలీజ్ చేశారు. ఇక మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ Allu Aravind ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

‘వరల్డ్ ఆఫ్ యూఐ’ చాలా ఆసక్తికరంగా ఉంది. అబ్బురపరిచే విజువల్స్, ఆసక్తి రేకిత్తే సన్నివేశాలతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది. గ్లింప్స్ లో ఒక్క డైలాగ్ లేదు.. కానీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకుంటోంది. చివర్లో ఉపేంద్ర దున్నపోతుపై ఎంట్రీ ఇవ్వడం, మాస్ అవతార్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ మారింది. 

ఇక గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా వేదికపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బెంగళూరు ప్రజలు అన్నీ భాషల వారిని అర్థం చేసుకుంటారు. నాకు ముఖ్యంగా శివన్న ఫ్యామిలీతో బాగా అటాచ్ మెంట్ ఉంది. ఇక ఉపేంద్ర 40 ఏళ్లుగా మా సినిమాల్లో నటిస్తున్నారు. వ్యక్తిగతంగానూ మంచి బంధం ఉంది. ఆయన సినిమాను (UI) కన్నడలో ఎంత గ్రాండ్ గా విడుదల చేస్తారో.. అదే స్థాయిలో తెలుగులోనూ రిలీజ్ చేస్తాం. AI అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... UI అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని సినిమా టైటిల్ కు కొత్త నిర్వచనం ఇచ్చారు.’ ఇక గతంలో కన్నడ నుంచి ‘కాంతారా’ చిత్రాన్ని అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. 

ఈ చిత్రంలో రీష్మా నానయ్య ప్రధాన పాత్రలో నటించింది. ఉపేంద్ర రచన, స్వీయ దర్శకత్వంలో నటించడం విశేషం. మొత్తం ఎనిమిది భాషల్లో విడుదలవుతోంది. చిత్రంలో మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios