యూవీ క్రియేషన్స్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం సాహో ఫైనల్ గా 400కోట్ల కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇక సినిమా దర్శకుడు సుజిత్ అలాగే ఇతర టెక్నీషియన్స్ కష్టపడిన విధానాన్ని వరల్డ్ ఆఫ్ సాహో వీడియో ద్వారా ఆడియెన్స్ కి తెలియజేశారు. 

టీమ్ మొత్తం ఒక డ్రీమ్ కోసం వర్క్ చేసిందనే భావన కలుగుతోంది. వీడియో చూస్తుంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక తెలుగు హీరో సినిమా రూపొందిందని చెప్పవచ్చు. సబు సిరిల్ ఆర్ట్ వర్క్, కనల్ కన్నన్ విఎఫ్ఎక్స్ , కెన్నీ బెట్స్ పనితనం ఏ స్థాయిలో ఉంటుందో వీడియో ద్వారా ఒక క్లారిటీ వచ్చింది. ఇక దర్శకుడు సుజిత్ కూడా తన మేకింగ్ గురించి అలాగే కథానాయకుడు ప్రభాస్ సీనియర్ టెక్నీషియన్స్ తో వర్క్ చేసిన అనుభూతి గురించి వివరించారు. 

సినిమాలో డ్రామా సీన్స్ కోసం తక్కువ సమయం తీసుకున్నట్లు చెప్పిన సుజిత్ ఎక్కువరోజులు యాక్షన్ సీన్స్ కోసం టీమ్ మొత్తం కలిసి పని చేసినట్లు చెప్పారు.