నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ కుమార్తె మృతి.. ప్రపంచ ప్రముఖుల సంతాపం
వరల్డ్ టాప్ కమెడియన్.. దివంగత దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ కుమార్తె మరణించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆమె మరణించినట్టు తెలుస్తోంది.

ప్రపంచ దిగ్గజ హాస్యనటుడు, నవ్వుల రేడు, దివంగత హాలీవుడ్ నటుడు చార్లీచాప్లిన్ కుమార్తె, ప్రముఖ హాలీవుడ్ నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. 74 సంవత్సరాల వయస్సులో.. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ.. మరణించినట్టు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతే కాదు వారు చెపుతున్న వివరాల ప్రకారం ఈ నెల 13న పారిస్‌లో ఆమె మృతి చెందారు.
ఇక ఆమె వివారాల విషయానికి వస్తే.. 28 మార్చి 1949న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో చార్లీ చాప్లిన్- చార్లీ చాప్లిన్-ఊనా ఓ నీల్ దంపతులకు జోసెఫిన్ జన్మించారు. చార్లీ చాప్లిన్ దంపతులకు 8 మంది సంతానం కాగా అందులో జోసెఫిన్ మూడో వారు. 1952లో తన తండ్రి సినిమా ‘లైమ్‌లైట్’తో చిన్న వయసులోనే తెరంగేట్రం చేశారు. 1972లో అవార్డు విన్నింగ్ సినిమా ‘పీర్ పావలో పాసోలిని’తోపాటు మరెన్నో సినిమాల్లో దిగ్గజ నటులతో కలిసి నటించారు.
జోసెఫిన్ పారిస్ లో సెటిల్ అయ్యారు. ఆమెకు భర్త ముగ్గురు కొడుకులు ఉన్నారు. మంచి నటిగా కూడా ఆమె నిరూపించుకుంది. జోసెఫిన్ మరణ వార్త తెలిసి ప్రపంచ దిగ్గజ నటులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె మృతికి హాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.