మలయాళ నటి లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న హీరో దిలీప్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు. దీంతో అప్పటివరకు ఆయనపై నిషేధాన్ని ప్రకటించిన అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) దాన్ని ఎత్తివేస్తూ అతడికి తిరిగి సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో హీరోయిన్లందరూ ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితురాలితో పాటు రమ్య నంబీసన్, రిమా కలింగల్, గీత్ మోహన్ దాస్ లు అమ్మకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఎమర్జన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ తరఫున నటి రేవతి, పార్వతీ మీనన్, పద్మప్రియలు ఈ నిర్ణయంపై పునారాలోచన చేయాలని కోరారు. ఈ సంఘటన పట్ల అసహనంతో ఉన్న దిలీప్ తాను అమ్మ సభ్యత్వాన్ని స్వీకరించడం లేదని తేల్చి చెప్పారు. తాను నిర్దోషిగా నిరూపించుకున్న తరువాతే అమ్మలో సభ్యత్వం తీసుకుంటానని అన్నారు.