Asianet News TeluguAsianet News Telugu

జీవితంపై విరక్తి అంటూ సినీ మేకప్ ఉమన్ ఆత్మహత్య..!


మేకప్ ఉమన్ సత్యప్రియ మరణం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 
 

woman make up artist satya priya commits suicide ksr
Author
First Published Jun 1, 2023, 7:28 AM IST

చెన్నైలో నివాసం ఉంటున్న సత్యప్రియ చాలా కాలంగా మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నారు. నలభై ఏళ్ల సత్యప్రియ భర్తతో విడిపోయారు. ఆమె వడపళని కుమరన్ నగర్ లో ఒంటరిగా ఉంటున్నారు. సత్యప్రియకు ఒక అమ్మాయి కాగా పేరు యోగిత. కూతురు కెనడా ఉంటుంది. గత ఆదివారం సత్యప్రియ కూతురు  యోగితకు వాట్స్ అప్ కాల్ చేసింది. తనకు జీవితం మీద విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. 

తల్లి సత్యప్రియ మాటలకు కంగారు పడ్డ యోగిత వెంటనే సమీప బంధువుకు ఫోన్ చేసి అమ్మ వద్దకు వెళ్లాలని కోరారు. బంధువు వెళ్ళేసరికే ఆలస్యమైంది. అప్పటికే సత్యప్రియ నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా... కేసు నమోదు చేసి బాడీని పోస్ట్ మార్టం కి పంపారు. ఒంటరి తనమే ఆమెను ఈ చర్యకు పురిగొల్పిందని తెలుస్తుంది. సత్యప్రియ మరణంతో సన్నిహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ సానుభూతి తెలియజేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios