Asianet News TeluguAsianet News Telugu

ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన డేనియల్ బాలాజీ, అదేంటో తెలుసా?


నటుడు డేనియల్ బాలాజీ అకాల మరణం పొందారు. అభిమానులు శోకసంద్రంలో మునిగారు. కాగా డేనియల్ బాలాజీ తన చిరకాల కోరిక తీరకుండానే కన్నుమూశాడు. అదేమిటో చూద్దాం. 
 

with out fulfilling his wish daniel balaji died ksr
Author
First Published Mar 30, 2024, 6:23 PM IST

ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం పొందారు. 48 ఏళ్ల  డేనియల్ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి డేనియల్ బాలాజీని కుటుంబ సభ్యులు తరలించారు. మార్గం మధ్యలోనే డేనియల్ బాలాజీ తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. డేనియల్ బాలాజీ వివాహం చేసుకోలేదు. చిత్తూరుకు చెందిన డేనియల్ తండ్రి తెలుగువాడు కాగా,  తల్లి తమిళ్. 

డేనియల్ బాలాజీ ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. అనంతరం సీరియల్స్ లో నటించాడు. 2002లో విడుదలైన 'ఏప్రిల్ మదతి' అనే తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. దర్శకుడు గౌతమ్ మీనన్ కి డేనియల్ బాలాజీ సన్నిహితుడు. ఆయన చిత్రాల్లో డేనియల్ బాలాజీ కీలక రోల్స్ చేశాడు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన వెట్టైయాడు వెలైయాడు మూవీలో సైకో కిల్లర్ గా డేనియల్ బాలాజీ అద్భుత నటన కనబరిచాడు. రాఘవన్ గా తెలుగులో ఈ చిత్రం విడుదలైంది. 

ఇక తెలుగులో ఆయన మొదటి చిత్రం సాంబ. ఘర్షణ, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల్లో కీలక రోల్స్ చేశాడు. తెలుగులో డేనియల్ బాలాజీ చివరి చిత్రం టక్ జగదీశ్. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో 50 కి పైగా చిత్రాల్లో డేనియల్ బాలాజీ నటించినట్లు సమాచారం. 

అయితే డేనియల్ దర్శకుడు కావాలి అనుకున్నాడు. ఫిల్మ్ మేకింగ్ లో కోర్సు కూడా చేశాడు. 2014లో తాను ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. స్క్రిప్ట్ సిద్ధం అయ్యింది. ఈ చిత్రానికి నేను దర్శకత్వం వహించడంతో పాటు కీలక రోల్ చేస్తాను. తమిళ్ తో పాటు కన్నడలో చిత్రీకరించాలి అనేది ఆలోచన.  నా మిత్రుడు ఎమ్మార్ గణేష్ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తాడని చెప్పాడు. కారణం తెలియదు కానీ అది కార్యరూపం దాల్చలేదు.  అతని మృతి వార్త తెలిసిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios