సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీ ట్రైలర్ కు విశేష స్పందన పవర్ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన సాయిధరమ్ తేజ్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విన్నర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ లో మెరిసింది. రెండు రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ట్రైలర్ కు ఇండియన్ యానిమల్ బోర్డు నుండి అనుమతి రాకపోవడంతో కాస్త ఆలస్యంగా ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ఇక ఈ ట్రైలర్ చూస్తే మాస్ కు అలాగే మెగా ఫ్యాన్స్ కేక పెట్టడం ఖాయం . మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంది విన్నర్ ట్రైలర్. ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్ దగ్గర క్లిక్స్ ఉన్నాయంటే ఏ రేంజ్ లో అదరగొడుతోందో అర్థం చేసుకోవచ్చు. 

జగపతి బాబు , ముఖేష్ ఋషి , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ అందాలు కూడా అదనపు ఆకర్షణ గా నిలవనున్నాయి . ట్రైలర్ లోనే రకుల్ ఇంతగా అందాలను ఆరబోస్తే తెరమీద ఏ రేంజ్ లో అందాలు ఆరబోసి ఉంటుందో.