మిక్స్ డ్ రెస్పాన్స్ ఉన్నా పోటీ లేకపోవడంతో వీకెండ్ లో విన్నర్ మంచి కలెక్షన్స్కలెక్షన్స్ బాగున్నాయనుకునే లోపే కంగారు పుట్టించిన సెకండ్ వీక్ ట్రేడ్ఫైనల్ గా విన్నర్ ముంచాడా..తేల్చాడా.. ఎంతకు..
సాయిధరమ్ తేజ్ 'విన్నర్' సినిమాకు టాక్ మిక్స్ డ్ గా ఉన్నా... కొన్ని కారణాల వల్ల ఓపెనింగ్స్ బానే వచ్చాయి. తొలి వారాంతంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.11 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. టాక్ ను బట్టి చూస్తే ఈ వసూళ్లు బెటర్‌గా వచ్చినట్లేనని చెప్పాలి. ఐతే సినిమాను భారీగా రిలీజ్ చేయడం వల్ల... పోటీ పెద్దగా లేకపోవడం వల్ల ఆ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయని... సినిమా అసలు సత్తా ఏంటన్నది వీకెండ్ అయ్యాకే తెలుస్తుందని ట్రేడ్ పండిట్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వాళ్ల సందేహాలే నిజమని వీకెండ్ తర్వాత 'విన్నర్' బాగా వీకైపోవటంతో తెలుస్తోంది.
విన్నర్ మూవీ తొలి మూడు రోజుల్లో రూ.11 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. భారీగా రిలీజ్ చేయడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ అదుర్స్ అనిపించినా ఆదివారం తర్వాత నాలుగు రోజుల్లో కేవలం రూ.2 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. దీన్ని బట్టే కలెక్షన్లు ఏ స్థాయిలో పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో మొదట్నుంచి ఈ సినిమా డల్ గానే ఉండగా.. వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సైతం వసూళ్లు దారుణంగా పడిపోయి నామమాత్రంగానే వచ్చాయి.
ఇక ఈ శుక్రవారం మూడు సినిమాలు బరిలోకి దిగిన నేపథ్యంలో 'విన్నర్' ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఆల్రెడీ థియేటర్లు బాగా తగ్గిపోయాయి. ఫుల్ రన్లో ఈ చిత్రం షేర్ రూ.15 కోట్లకు అటు ఇటుగా ఉండొచ్చేమోనని ట్రేడ్ వర్గాల అంచనా. ఐతే ఈ చిత్రానికి రూ.25 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. రూ.28 కోట్ల దాకా షేర్ రాబడితేనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు వస్తుంది.
ఐతే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఈ చిత్రం తక్కువలో తక్కువ రూ.10 కోట్లయినా నష్టం తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనింగ్స్ చూసి.. బాక్సాఫీస్ విన్నర్.. బాక్సాఫీస్ విన్నర్ అని ప్రచారం చేశారు కానీ.. ఫైనల్‌గా 'విన్నర్' బాక్సాఫీస్ వద్ద కుదేలయ్యేలా ఉన్నాడు.
