టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కోసం టాలీవుడ్ దర్శకనిర్మాతలు మాత్రమే కాదు.. ఇతర భాషలకు చెందిన మేకర్స్ కూడా ఎగబడుతున్నారు. ఆయనతో సినిమాలు చేయాలని తెగ ప్లాన్లు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ దర్శకనిర్మాతలు అతడితో సినిమా చేస్తే తమిళ, తెలుగు భాషల్లో మార్కెట్ చేసుకోవచ్చని చూస్తున్నారు.

'నోటా' సినిమాకి ఆశించిన ఫలితం రానప్పటికీ విజయ్ కి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉందని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు చేసే ఓ నిర్మాణ సంస్థ విజయ్ తో బైలింగువల్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తోంది.

విజయ్ దగ్గర ప్రస్తుతానికి కాల్షీట్స్ లేనప్పటికీ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి అతడిని టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తోందట. ఇప్పటికే బైలింగువల్ సినిమా 'నోటా'లో నటించి ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. మళ్లీ మరో బైలింగువల్ అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. పైగా మన తెలుగు హీరోలకు బైలింగువల్ సినిమాలు పెద్దగా కలిసిరావు. చాలా మంది హీరోలు బైలింగువల్ సినిమాలు చేసి డిజాస్టర్ రిజల్ట్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఉదాహరణకి మహేష్ బాబు 'స్పైడర్' సినిమా చెప్పుకోవచ్చు. ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ మళ్లీ రెండు భాషల్లో నటించే సాహసం చేస్తాడా..? అనేది చూడాలి. ప్రస్తుతం ఈ హీరో 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. అలానే నాలుగు సినిమాల అడ్వాన్స్ లు కూడా అతడి చేతిలో ఉన్నాయి.