హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. వివాదం ముగుస్తుంది అనుకున్న టైమ్ కు.. ఇంకో వివాదం స్టార్ట్ అవుతుంది. ఈ వివాదాలు విల్ స్మిత్ ఆస్కార్ కే ఎసరు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.  

ఆస్కార్‌ వేదికగా చెంపదెబ్బ కొట్టిన హాలీవుడ్‌ స్టార్‌ హీరో విల్ స్మిత్ కు టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. సర్ధుమణిగింది అనుకున్న ఆస్కార్ ఇష్యూ ఇంకా రగులుతూనే ఉంది. పాపం హాలీవుడ్ స్టార్ హీరోకు వరుసగా తిప్పలు తప్పడం లేదు. ఆస్కార్ వేడుకలప్పటి నుంచీ ఏదో ఒక విదంగా విల్ స్మిత్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ ఆస్కార్ సందర్భంగా యాంకర్ క్రిస్ ను చెప్ప దెబ్బ కొట్టాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. 

కొన్ని రోజులకు ఈ వివాదంపై విచారణ జరిగి విల్ స్మిత్ పై పదేళ్లు నిషేధం కూడా విధించారు. అయితే సరే విల్ స్మిత్ పై హాలీవుడ్ కు కోపం తగ్గలేదు. రీసెంట్ గా ఈ వివాదంపై మరో హాలీవుడ్‌ నటుడు హ్యారీ లెనిక్స్‌ స్పందించారు. స్మిత్‌ చేసిన పనికి ఈ శిక్ష ఒక్కటే సరిపోదన్నారు. విల్‌ స్మిత్‌ నుంచి ఉత్తమ నటుడి కేటగిరిలో ఇచ్చిన ఆస్కార్‌ అవార్డును తిరిగి తీసుకోవాలన్నాడు.

నా దృష్టిలో ఇది తగిన శిక్ష కాదని, విల్‌ స్మిత్‌ తన వార్డు ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌ ద్వారా అకాడమీకి అవార్డును తిరిగి ఇవ్వాలన్నాడు. అకాడమీ నిర్ణయం దిగ్భ్రాంతి కలిగించిందని హ్యారీ అన్నారు. రీసెంట్ గా 94 వ ఆస్కార్ వేడుకల్లో.. తన భార్య జాడా పింకెట్‌ అనారోగ్యంపై ప్రముఖ అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ జోక్‌ వేశాడన్న కారణంతో విల్‌ అతని చెంపచెల్లుమనిపించాడు. ఆస్కార్‌ అందుకంటూ ఈ సంఘటనపై అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు క్షమాపణలు కూడా చెప్పాడు విల్‌ స్మిత్‌. అటు సోషల్‌ మీడియా లో కూడా క్రిస్‌ రాక్‌ను క్షమించమని కోరాడు. 

అయితే సరే అతనిపై పదేళ్లు నిషేధం విధుస్తూ నిర్ణయం తీసుకున్నారు టీమ్. అయినా సరే అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు విల్‌ స్మిత్‌ పేర్కొన్నాడు.ఇక ఇన్ని జరిగాయి. ఇక ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటుండగా.. మళ్లీ ఏదో విదంగా రగులుతూనే ఉంది. ఇప్పటికే హాలీవుడ్‌ ఫిల్మ్‌ అకాడమీకి విల్‌ స్మిత్ రాజీనామా చేస్తూ బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే అని కూడా తెలిపాడు. ఆ చెంపదెబ్బ వ్యవహరం ప్రభావం ఎంత వరకూ వెళ్లిందంటే విల్ స్మిత్ కెరీర్ ప్రభావం పడింది. సినిమాలు ఆగిపోతున్నాయి. తాజాగా ఆయన ఆస్కార్ తిరిగి ఇచ్చేయాలి అని డిమాండ్ పెరిగిపోతుంది.