ఈసారైనా.. లాభాలు తెచ్చిపెడతాడా..?

will producers earn profit with sakshyam movie
Highlights

ఈ చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ రేంజ్ చూస్తే ఈ సినిమా లాభాలను తెచ్చిపెడుతుందా అనేది సందేహంగా మారింది. గతంలో కూడా సాయి శ్రీనివాస్ ఈ రేంజ్ బడ్జెట్ లోనే సినిమాలు చేశాడు. కానీ నిర్మాతలకు లాభాలు మిగిలిన సందర్భాలు మాత్రం లేవు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ రూపొందించిన చిత్రం 'సాక్ష్యం'. ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.38 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తంగా సొంతం చేసుకుంది ఈరోస్ సంస్థ. ఈరోస్ లాంటి క్రేజ్ ఉన్న సంస్థ ఈ సినిమా రైట్స్ ను తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

తమకున్న పలుకుబడితో ఈ నిర్మాణ సంస్థ ఫాన్సీ రేట్లకు లోకల్ బయ్యర్లకు విక్రయించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ రేంజ్ చూస్తే ఈ సినిమా లాభాలను తెచ్చిపెడుతుందా అనేది సందేహంగా మారింది. గతంలో కూడా సాయి శ్రీనివాస్ ఈ రేంజ్ బడ్జెట్ లోనే సినిమాలు చేశాడు. కానీ నిర్మాతలకు లాభాలు మిగిలిన సందర్భాలు మాత్రం లేవు.

'జయ జానకి నాయక' సినిమా కోసం నలభై కోట్లకు పైగా ఖర్చు పెడితే.. ఆ సినిమా ఇరవై కోట్లు మాత్రమే రాబట్టిందని సమాచారం. శాటిలైట్, ఇతర హక్కులు కలిపి మరో పది కోట్లు తెచ్చియిపెట్టాయి. అంటే పది కోట్లు నష్టాలే అన్నమాట. మరి ఆ సినిమాలతో పోలిస్తే 'సాక్ష్యం' ఎంతవరకు వసూలు చేస్తుందో చూడాలి..! 

loader