Asianet News TeluguAsianet News Telugu

#Kalki2898AD: ఓ ఇంట్రస్టింగ్ న్యూస్,నిజమైతే మామూలుగా ఉండదు

 కల్కి సినిమాలో ప్రభాస్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కు సంబందించిన మూడు పాత్రల్లో కనిపించనున్నారట.  ఒక్కో టైం పీరియడ్  లో ఒక్కో గెటప్ లో కనిపించి ఆడియన్స్ ను అలరించనున్నారు ప్రభాస్ అని చెప్తున్నారు. 
 

Will Prabhas Triple Avatars Elevate Kalki 2898 AD ? jsp
Author
First Published Dec 15, 2023, 10:59 AM IST


ప్రభాస్‌ (Prabhas) హీరో గా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD).  షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అప్డేట్స్  కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఓ విషయం బయిటకు వచ్చి ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ఈ చిత్రంలో ప్రభాస్ మూడు గెటప్స్ లో కనిపించనున్నారట. 

రీసెంట్  నెట్‌ఫ్లిక్స్ సీఈఓ హైదరాబాద్ వచ్చి  కల్కి మూవీ సెట్స్‌లో ప్రభాస్ ను కలిసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలో ప్రభాస్ గుబురు గడ్డంతో   కనిపించారు. దాంతో ఆ లుక్ రావటంతో  ఈ వార్తని రెడీ చేసారు జనం.  అదేంటంటే.. కల్కి సినిమాలో ప్రభాస్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కు సంబందించిన మూడు పాత్రల్లో కనిపించనున్నారట.  ఒక్కో టైం పీరియడ్  లో ఒక్కో గెటప్ లో కనిపించి ఆడియన్స్ ను అలరించనున్నారు ప్రభాస్ అని చెప్తున్నారు. 

టీజర్ లో లాంగ్ హెయిర్ తో కనిపించిన ప్రభాస్.. చిరంజీవి బర్త్ డే సందర్బంగా రిలీస్ చేసిన వీడియోలో షార్ట్ హెయిర్ తో కనిపించారు. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలో గుబురు గడ్డంతో కనిపించారు. వీటిన్నటినీ దృష్టిలో పెట్టుకునే  ఈ సినిమాలో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కు సంబందించిన మూడు పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. అయితే అది రూమరా, నిజమా అనేది తెలియాల్సి ఉంది.  ‘కల్కి’లో వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో ఉండనున్నాయని ప్రభాస్‌ అభిమానులు సంబరపడుతున్నారు.
 
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె నటిస్తోంది. సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్‌ ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీని గ్లింప్స్‌కు భారీ స్పందన వచ్చింది.   

 ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా ప్రాజెక్ట్ కే సినిమా తెర‌కెక్కుతోంది.  ఈ  ఫ్రాంచైజీ మొదటి భాగంలో ప్రభాస్... కమల్ తో పోరాడేందుకు భవిష్యత్తులోకి అంటే 2600 సంవత్సరంలోకి ప్రయాణిస్తారట. అందుకు దారి తీసే పరిస్దితులు ...ఆ కాలానికి ప్రయాణించేందుకు ప్రభాస్‌ సిద్ధం కావడంతో ముగుస్తుంది. ఇక ఫ్రాంచైజీ 2వ భాగం పూర్తిగా ప్రభాస్, కమల్ హాసన్ మధ్యే నడవనున్నట్లు తెలుస్తోంది.  టెర్మనేటర్..భవిష్యత్ నుంచి  కాలంలో ప్రయాణించి  ఇప్పటి కాలానికి వెనక్కి వచ్చినట్లు... ఇక్కడ ప్రభాస్  సినిమాలో ముందుకు వెళ్తారు. ‘ప్రాజెక్ట్ K’షూటింగ్  దాదాపు 80 శాతం పూర్తి అయ్యింది. కమల్ హాసన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  
   
  ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో  వస్తోన్న సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెబుతున్నారు.   ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్‌ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్‌ను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్.. అందులో భాగంగానే హాలీవుడ్ నుంచి ఓ నలుగురు యాక్షన్‌ డైరెక్టర్లను దించారట.
 

Follow Us:
Download App:
  • android
  • ios