నితిన్‌ మనసు సీనియర్‌ హీరోయిన్‌పై పడింది. తనకంటే ఏజ్‌లో పెద్దదైన స్టార్‌ హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలని భావిస్తున్నాడట. ఇంతకి ఆమె ఒప్పుకుంటుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరి ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరనేది చూస్తే, ఆమె ఎవరో కాదు స్టార్‌ హీరోయిన్‌ నయనతార. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ఈ భామ కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె సినిమాలు తమిళంలో స్టార్‌ హీరోలకు దీటుగా వసూళ్ళని రాబడుతున్నాయి. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. స్టార్‌ హీరోలకు ఉన్నంత క్రేజ్‌ ఆమె సొంతం. ఫ్యాన్స్ ఫాలోయింగ్‌లోనూ ఏమాత్రం తగ్గదు. 

ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నయనతార యంగ్‌ హీరోతో నటిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. నితిన్‌ నటించబోతున్న సినిమాల్లో బాలీవుడ్‌ హిట్‌ `అంధాదున్‌` ఒకటి. ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే జంటగా నటించారు. టబు కీలక పాత్ర పోషించారు. టబు పాత్రే హీరో లైఫ్‌కి చాలా కీలకం. ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. నితిన్‌ హీరోగా నటించనున్నారు. అందులో హీరోయిన్‌ కోసం అన్వేషణ జరుగుతుంది. ఇటీవల పూజా హెగ్డేని సంప్రదించడగా, అందుకు ఆమె నిర్మొహమాటంగా నో చెప్పింది. హీరోయిన్‌ పాత్రకి ప్రయారిటీ లేకపోవడంతో ఆమె చేయనని చెప్పినట్టు టాక్‌. 

 దీంతో నయనతారని సంప్రదిస్తున్నారట. అయితే ఆమెని హీరోయిన్‌ పాత్ర కోసమా? లేక టబు నటించిన పాత్ర కోసమా అన్నది సస్పెన్స్ గా మారింది. తమిళంలో బిజీగా ఉన్న ఈ అమ్మడు యంగ్‌ హీరో కోసం ఒప్పుకుంటుందా? అన్నది చూడాలి. నయనతార ప్రస్తుతం `నెట్రికన్‌`, `మూకుతి అమ్మన్‌`, `అన్నాత్తె` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న `అన్నాత్తె`లో ఆమె కీర్తిసురేష్‌కి తల్లి పాత్రలో కనిపించబోతుందని టాక్‌. ఈ సంక్రాంతికి విడుదలైన `దర్బార్‌`లో రజనీకాంత్‌కి జోడీగా నయన్‌ మెరిసిన విషయం తెలిసిందే.