బిగ్‌బాస్‌ శనివారం ఎపిసోడ్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అఖిల్‌తో గేమ్‌ ఆడుకున్నాడు. ఓ డ్రామా క్రియేట్‌ చేశాడు. హోస్ట్ నాగ్‌ రూపంలో అప్పటికప్పుడు అఖిల్‌ ఎలిమినేటెడ్‌ అని షాక్‌ ఇచ్చాడు. ఎప్పటిలాగే తన మార్క్ సస్పెన్స్ ని క్రియేట్‌ చేసి చివరి నిమిషంలో అఖిల్‌ వెళ్లడం లేదు అని చెప్పేశాడు. అయితే ఈ ఎపిసోడ్‌ అంతా ఆడియెన్స్, ఇంటి సభ్యులు ఊహిస్తూనే ఉంటారు. కచ్చితంగా ఇదే జరుగుతుందని అనుకుంటున్నారు. కాస్త టెన్షన్‌ క్రియేట్‌ చేసిన నాగ్‌ తుస్సుమనిపించాడు. 

ఇక పదోవారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్‌లో ఉన్న అభిజిత్‌ సేవ్‌ అయ్యాడు. మెహబూబ్‌, అరియానా, మోనాల్‌, సోహైల్‌, హారిక ఉన్నారు. వీరిలో ఈ వారం వెళ్ళేది ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది. అరియానా, మెహబూబ్‌, హారిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పదో వారం మాత్రం మెహబూబ్‌ వెళ్లిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

గేమ్స్ విన్నర్‌గా నిలుస్తున్న మెహబూబ్‌ మిగతా విషయాల్లో అంతా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఆయన కేవలం సోహైల్‌తోనే రిలేషన్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నారు. మిగలిన వారితో ఆయనకు అంత ర్యాపో లేదు. పైగా ఇంట్లో ఆయన్నుంచి ఎలాంటి హడావుడి కూడా ఉండదు. చాలా వరకు సైలెంట్‌గానే ఉండిపోతాడు. దీంతో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది మెహబూబ్‌ అనే తెలుస్తుంది. మరోవైపు హారిక పేరు కూడా వినిపిస్తుంది. కానీ అమ్మాయిలను పంపిస్తే గ్లామర్‌ తగ్గిపోతుంది. బిగ్‌బాస్‌ ఈ వారం మాత్రం ఆ సాహసం చేసే ఛాన్స్ లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే.