మహేష్ బాబు కల నిజమవుతుందా?

మహేష్ బాబు కల నిజమవుతుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా పూర్తి చేసి ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. లైన్ లో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. రీసెంట్ గా రాజమౌళితో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు మహేష్. ఒకవేళ రాజమౌళితో సినిమా చేస్తే 2018 లో ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్, రాజమౌళి ఉన్న పరిస్థితుల్లో మహేష్ తో సినిమా చేస్తారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

అసలు విషయంలోకి వస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న 'అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఓ సినిమా పూర్తి చేయాల్సివుంది. తాజాగా వెంకటేష్ తో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇవన్నీ పూర్తి చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఇక రాజమౌళి.. ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా పూర్తయ్యేసరికి 2019 అవుతుంది. ఈ నేపధ్యంలో మహేష్ తో ఈ దర్శకుల సినిమాలు ఇప్పట్లో రావని అర్ధమవుతోంది. కనీసం తరువాత అయినా.. ఈ  యాంబిషస్ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్తాయో.. లేదో.. చూడాలి!

ఇది కూడా చదవండి...

https://goo.gl/TnrDYL

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos