రికార్డులే స్టార్ హీరోల స్టామినాకు కొలమానాలు. ఫ్యాన్స్ కూడా తమ హీరో గురించి కాలర్ ఎగరేయాలంటే,ఆ రికార్డులు కావాలి. ఫాన్స్ మధ్య జరిగే ఎవరు గొప్ప అనే యుద్ధాలలో ఎక్కువ రికార్డులు ఉన్నోళ్ళదే పై చేయి అవుతుంది.కాగా తమ సినిమాలతో రికార్డ్స్ సృష్టించాల్సిన బాధ్యత హీరో మరియు దర్శక నిర్మాతలపై ఉండేది. ఐతే కొత్తగా వచ్చిన సోషల్ మీడియా రికార్డ్స్ మాత్రం పూర్తిగా ఫ్యాన్స్ చేతిలో ఉంటున్నాయి. ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లో వాళ్లకు ఉండే ఫాలోవర్స్ సంఖ్యను బట్టి కూడా ఓ హీరో స్టార్ డమ్ ఏమిటో అంచనా వేయడం జరుగుతుంది. ఇక తమ అభిమాన హీరో బర్త్ డే యాష్ ట్యాగ్, సినిమా టైటిల్, ఫస్ట్ లుక్స్, ట్రైలర్స్, టీజర్స్, బర్త్ డే సీడీపీ ట్రెండ్ చేయడం అనేది నయా ట్రెండ్. 

 
కాగా ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు జరుపుకోగా ఆయన ఫాన్స్ ఏకంగా వరల్డ్ రికార్డు కొట్టిన సంగతి తెలిసిందే. 60.2 మిలియన్ బర్త్ డే విశెష్ ట్వీట్ తో భారీ బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి ఇది ఓ టార్గెట్ గా మారింది. రానున్న కొద్దిరోజులలో మెగా ఫ్యామిలీ నుండి ఇద్దరు స్టార్ హీరోలు తమ పుట్టినరోజు జరుపుకోనున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 కాగా, పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2. కొద్దిరోజుల వ్యవధిలో ఉన్న ఈ రెండు మెగా ఈవెంట్స్ కి ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కంటే ముందు చిరు బర్త్ డే నేపథ్యంలో మహేష్ రికార్డు ని బీట్ చేసి చిరు, పవన్ కి కొత్త రికార్డు సెట్ చేస్తాడా అనే ఆసక్తి నెలకొంది. చిరంజీవి జీవితంలో మైలురాయి లాంటి 65వ పుట్టినరోజుకు సిద్ధం అవుతున్నారు. 
 
చిరు బర్త్ డే సీడీపీ దేశంలోని అనేక చిత్ర పరిశ్రమలకు చెందిన 65మంది ప్రముఖులు లాంచ్ చేయనున్నారని సమాచారం. ఆ రోజు ఆయన దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న ఆచార్య మూవీ ఫస్ట్ లుక్ సైతం విడుదల కానుంది. ఇక చిరు బర్త్ వేడుక ముగిసిన రెండు వారాలకు పవన్ కళ్యాణ్ బర్త్ డే జరుపుకోనున్నారు. సెప్టెంబర్ 2న ఆయన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ టీజర్ కూడా విడుదల కానుంది. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ఓ భారీ సోషల్ మీడియా రికార్డు సృష్టించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అంతకు ముందే పవన్ బర్త్ డే సీడీపీ విడుదల కూడా వుంది. మరి ఇలాంటి విషయాలను చాలా సీరియస్ గా తీసుకొనే మెగా ఫ్యాన్స్ మహేష్ రికార్డుని బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.