దివాళి  సంధర్భంగా బిగ్ బాస్ షో సరికొత్తగా ముస్తాబైంది. పండగ దుస్తుల్లో ఇంటి సభ్యులు తళుక్కున మెరవనున్నారు. పండగతో పాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కి, ప్రేక్షకులకు సరదా ఆటలు, టాస్క్ లతో వినోదం పంచనున్నారు. బిగ్ బాస్ ప్రేక్షకులకు నేటి ఎపిసోడ్ చాలా ప్రత్యేకముగా నిలవనుంది.

పండుగ సంగతి అటుంచితే వీకెండ్ కావడంతో ఎలిమినేషన్ కూడా ఉంటుంది . ఈ వారానికి గానూ  మొత్తం ఆరుగురు సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. ఇంటి సభ్యుల నుండి అత్యధికంగా వ్యతిరేకత మూటగట్టుకున్న ఆరియానా, అభిజిత్, సోహైల్, మెహబూబ్, హారిక మరియు మోనాల్ ఈ వారానికి గాను ఎలిమినేషన్ లో ఉన్నారు. సాధారణ ప్రక్రియ ప్రకారం నేటి ఎపిసోడ్ లో ఒకరిద్దరు సేవ్ కావడం జరుగుతుంది. 

మిగిలిన సభ్యుల్లో అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న ఇంటి సభ్యుడు హౌస్ ని వీడాల్సివుంటుంది. ఐతే ఈ వారం ఎలిమినేషన్ పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ నిలిపివేశాడట, ఆరుగురు సభ్యులలో ఎవరూ ఎలిమినేట్ కావడం లేదని సమాచారం. ఇంట్లో ఇంకా తొమ్మిది మంది సభ్యులు మాత్రమే మిగిలారు. నోయల్, గంగవ్వ ఆరోగ్య కారణాల చేత ఇంటిని వీడడం జరిగింది. కావున ఈ వారం ఎలిమినేషన్ ఉండదని టాక్. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురు చూడాలి.  మరోవైపు అఖిల్ బిగ్ బాస్ ఆదేశాల మేరకు సీక్రెట్ రూమ్ లో ఉంటున్నారు.