నిత్యా అంటే బన్నీ ఏం అంటాడో?

will allu arjun give nod to nithya menon
Highlights

అల్లు అర్జున్ మాత్రం తను నటించిన హీరోయిన్లను పెద్దగా రిపీట్ చేయడు. క్యాథరిన్ త్రెసా మాత్రం బన్నీతో రెండు సినిమాలు చేసింది. నిత్యామీనన్ కూడా 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో బన్నీతో కలిసి నటించింది. పైగా ఈ మధ్య అమ్మడు బాగా బరువు కూడా పెరిగింది. మరి విక్రమ్ ఛాయిస్ ను బన్నీ ఎలా ఎవైడ్ చేస్తాడో చూడాలి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇటీవల విక్రమ్ కుమార్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ హీరో త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. 

త్రిల్లర్ నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారనే విషయంలో నటి నిత్యామీనన్ పేరు వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ కు నిత్యామీనన్ సెంటిమెంట్ అనే చెప్పాలి. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'ఇష్క్','24' వంటి సినిమాలలో నిత్యా హీరోయిన్ గా కనిపించింది. ఆమె నటన విక్రమ్ కు నచ్చడంతో ఇప్పుడు మరోసారి ఆమెను రిపీట్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం తను నటించిన హీరోయిన్లను పెద్దగా రిపీట్ చేయడు.

క్యాథరిన్ త్రెసా మాత్రం బన్నీతో రెండు సినిమాలు చేసింది. నిత్యామీనన్ కూడా 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో బన్నీతో కలిసి నటించింది. పైగా ఈ మధ్య అమ్మడు బాగా బరువు కూడా పెరిగింది. మరి విక్రమ్ ఛాయిస్ ను బన్నీ ఎలా ఎవైడ్ చేస్తాడో చూడాలి. అయితే నిత్యాను యాక్సెప్ట్ చేసినా.. ఆమెను సెకండ్ హీరోయిన్ గానే తీసుకోబోతున్నారు. మెయిన్ హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావిస్తున్నారు. 
 

loader