‘వైల్డ్ డాగ్': ఎంతకు అమ్మారు? ఎంత నష్టం?
ఈ సినిమా విడుదలైన 19రోజులకే ఓటీటీలో అందుబాటులో ఉంచారు. అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దాంతో అసలు ఈ సినిమా థియోటర్ లో ఎంత కలెక్ట్ చేసింది. ఎంత పెట్టుబడి పెట్టారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
కెరీర్ ప్రారంభం నుంచీ కొత్త దనం ఉన్న కథలతో పాటు దర్శకులను పరిచయం చేయడంతో ముందుంటున్నారు నాగార్జున. అందులో భాగంగా ఆయన కొత్త తరహా ఎక్సపెరమెంట్స్ కు ట్రై చేస్తూంటారు. అలా చేసిన ప్రయోగం వైల్డ్ డాగ్. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో కొత్త దర్శకుడు అషిషోర్ సోలోమన్ తెరకెక్కించారు. ఎన్నో అంచనాల నడుమ వైల్డ్ డాగ్ మార్చ్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో నాగార్జునతో పాటు అందరూ బాగా చేసారన్నారు. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం చాలా వెనకబడింది. విడుదలైన రెండు రోజులకే చేతులెత్తేసింది. రీసెంట్ గా ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవటం మొదలెట్టింది. ఈ సినిమా విడుదలైన 19రోజులకే ఓటీటీలో అందుబాటులో ఉంచారు. అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దాంతో అసలు ఈ సినిమా థియోటర్ లో ఎంత కలెక్ట్ చేసింది. ఎంత పెట్టుబడి పెట్టారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘వైల్డ్ డాగ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.40 కోట్లుగా లెక్కేసారు. బిజినెస్ క్లోజింగ్ సమయానికి ఈ చిత్రం రూ. 3.53 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే.. దీనికి రూ. 5.87 కోట్లు నష్టం వచ్చింది. ఫలితంగా నాగ్ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు నెట్ ప్లిక్స్ లో సూపర్ హిట్టైంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా హిట్ అనాలా,ప్లాఫ్ అనాలా అనేది తేలని పరిస్దితి.
ఈ సినిమా తో నాగార్జున ..కంబ్యాక్ ఖాయమని అంతా భావించారు కానీ అలా జరగలేదు. కరోనా భయంతో సినిమా బాగుందని టాక్ వచ్చినా జనాలు సినిమాని చూడటానికి థియేటర్స్ కి రాలేదు, దానికి తోడు సినిమాలో డైలాగ్స్ ఎక్కువ భాగం ఇంగ్లీష్ లేదా హిందీ లో ఉండటం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఓటీటి వ్యూయర్స్ బాగా చదువుకున్నవాళ్ల శాతం ఎక్కువ ఉండటంతో కలిసి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియా లో సూపర్ రెస్పాన్స్ ను ఊహించినట్లే సొంతం చేసుకుంటుంది. నెట్ ఫ్లిక్స్ లో రీసెంట్ టైం లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూయర్ షిప్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది.