'ఏడు చేపల కథ' అనే అడల్ట్ సినిమాలో టెంప్ట్ రవి పాత్రలో నటించిన అభిషేక్ రెడ్డి అనే నటుడు శృతిమించిన శృంగారం, బూతు సీన్లలో నటించి యూట్యూబ్ ఛానెల్స్ కి మంచి మసాలా కంటెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మరో బూతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోతున్నాడు.

అదే 'వైఫ్, ఐ'.. ఈ సినిమాలో గుంజన్, ఫిదా గిల్, కావ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేని ఈ టీజర్ లో శృంగారభరిత సన్నివేశాలు ఎక్కువయ్యాయి. రొమాన్స్ కి ఎక్కువ.. బ్లూ ఫిల్మ్ కి తక్కువ అన్నట్లు టీజర్ ని కట్ చేశారు.

భర్తని మోసం చేస్తూ భార్య సాగించే రాసలీలల కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లున్నారు. టీజర్ లోనే ఎన్నో ఘాటు సన్నివేశాలను చూపించిన చిత్రబృందం సినిమాతో ఇంకెంత రచ్చ చేస్తుందో..! సినిమాకి కచ్చితంగా సెన్సార్ సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెన్సార్ ని దాటుకొని సినిమా రావడం కాస్త కష్టమే.. మరేం జరుగుతుందో చూడాలి. ఈ చిత్రాన్ని లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై జి.చరితారెడ్డి నిర్మిస్తున్నారు.