రీసెంట్ గా నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు 2 చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాఫ్ ఎఫెక్ట్ నాగ్ మీద ఎంత ఉందో తెలియదు కానీ వెంకటేష్ మీద గట్టిగానే ఇంపాక్ట్ చూపించింది అని తెలుస్తోంది. ఇద్దరూ సమ వయస్కులు కావటంతో మన్మధుడు 2 సినిమా ఎందుకు ప్లాఫ్ అయిందో విశ్లేషించుకున్న వెంకటేష్, సురేష్ బాబు తాము చేద్దామనుకున్న రీమేక్ కు బై చెప్పేసారని సమాచారం.

ఈ సంవత్సరం ప్రారంభంలో  విక్టరీ వెంకటేష్  అనిల్ రావిపూడి దర్శకత్వంలో  వచ్చిన ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమాగానే కాకుండా కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దాంతో  బాలీవుడ్ లో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ మరియు టబు  నటించగా సూపర్ హిట్ అయిన దేదే ప్యార్ దే సినిమాని తెలుగులో రీమేక్ చేయావని ప్లాన్ చేసారు . సురేష్ బాబు స్వయంగా ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడు.

ఈ సినిమా కథ ..50 ఏళ్ళు ఉన్న ఒక వ్యక్తి తన కంటే వయసులో చాలా చిన్న అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మ్యారేజ్‌ అండ్‌ మోడ్రన్‌ డేస్‌ రిలేషన్‌షిప్స్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది.  ‘దే దే ప్యార్‌ దే’ అనే టైటిల్‌ అర్దం ఏమిటంటే.. అంటే.. ఇవ్వు.. ఇవ్వు.. ప్రేమ ఇవ్వు అని అర్థం.  

ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తే బాగుంటుందని సురేష్ బాబు  భావించాడు. కానీ ఎప్పుడైతే నాగార్జున మన్మధుడు2 లో పెళ్లి కాని కుర్రాడిగా రకుల్ ప్రీతి తో ప్రేమలో పడే వాడిగా కనపించి ,డిజాస్టర్ అయ్యాడో ఆ క్షణమే  వెంకీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో సురేష్ బాబు ఇప్పుడు ఈ సినిమాని ఏ  సీనియర్ హీరోతో చేస్తే బాగుంటుందా అని ఆలోచనలో పడ్డారట.

ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ చేస్తున్నారు. ఆ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రం కాకుండా ఈ సీనియర్ హీరో  ఈ మధ్యనే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేశాడు. ఈ సినిమా గురించి గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి