Asianet News TeluguAsianet News Telugu

'వాల్మీకి' టైటిల్ పెట్టడానికి కారణం?

'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్‌2' అంటూ ఒకదానికొకటి సంబంధం లేని చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు వరణ్ తేజ్.  

Why Varun teja's Movie titled Valmiki?
Author
Hyderabad, First Published Jan 27, 2019, 4:19 PM IST

'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్‌2' అంటూ ఒకదానికొకటి సంబంధం లేని చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు వరణ్ తేజ్. తాజాగా వరుణ్‌తేజ్‌ హీరోగా 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న భారీ చిత్రం 'వాల్మీకి'. ఈ చిత్రం ఈరోజు (జనవరి 27న) హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ సినిమాకు వాల్మికి అనే టైటిల్ పెట్టడం వెనక పెద్ద కథే ఉందంటున్నారు.   

ఈ సినిమాని త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ జిగ‌ర్తాండ‌కు రీమేక్ గా తెర‌కెక్కిస్తున్నార‌ు.  నేటివిటీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా స్క్రిప్టును తెలుగైజ్ చేశార‌ట‌.  జిగర్తాండ తమిళ వెర్షన్ కి `పిజ్జా` ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.  ఈ సినిమా లో సిద్ధార్థ్, బాబీసింహా హీరోలుగా నటించారు. 2014లో వచ్చిన హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ఈ సినిమాగా ప్రశంసలు అందుకుంది. 

ఈ సినిమాలో కథ ప్రకారం ...ఓ దుర్మార్గుడైన  రౌడీ షీటర్ లో ఓ సినీ దర్శకుడి వల్ల మార్పు వస్తుంది. వాల్మికి కథ కూడా అంతే.  ఒక దొంగ‌లోని ప‌రివ‌ర్త‌న అన్న‌ది వాల్మీకి క‌థ‌. అందుకే వాల్మికిని గుర్తు చేసేందుకు ఈ కథ కు ఈ టైటిల్ పెట్టారనే ప్రచారం,  చ‌ర్చా సినీమీడియాలో సాగుతోంది. 

ఈ చిత్రానికి సంగీతం: రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్‌, కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌, స్క్రీన్‌ప్లే: మధు, చైతన్య, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios