Asianet News TeluguAsianet News Telugu

దేవిశ్రీ ప్రసాద్..శివనాగులు పాటను ఎందుకు రీప్లేస్ చేసినట్లు..?

దేవిశ్రీ ప్రసాద్..శివనాగులు పాటను ఎందుకు రీప్లేస్ చేసినట్లు..?
Why the shivanagulu song are removed?

 

దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీత దర్శకుడు. అందులో సందేహం లేదు. కానీ అతను మంచి గాయకుడా అంటే మాత్రం సందేహాలు వ్యక్తమవుతాయి. అతడి వాయిస్ అంత స్వీట్గా ఏమీ ఉండదు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ పాడిన ‘నాన్నకు ప్రేమతో’ సాంగ్ లాంటివి మినహాయిస్తే దేవి పాటలు ఏమంత ఆకట్టుకోవు. కానీ అతను మాత్రం అప్పుడప్పుడూ గొంతు సవరించుకుంటూనే ఉంటాడు. పాటలు పాడేస్తుంటాడు. తాజాగా ‘రంగస్థలం’లోనే దేవి పాడిన ఎంత సక్కగున్నావే పాట విషయంలోనూ మిశ్రమ స్పందన వచ్చింది. ఈ పాట ట్యూన్.. సాహిత్యం చాలా బాగున్నా.. దేవిశ్రీ వాయిస్ దానికి సూటవ్వలేదన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. ఏదైనా స్వీట్ వాయిస్ తోడై ఉంటే ఈ పాట రేంజే వేరేగా ఉండేదన్నారు.
 

ఆ పాట సంగతలా వదిలేస్తే.. ‘రంగస్థలం’ సినిమా చూసిన వాళ్లకు మరో పాటలోనూ దేవిశ్రీ వాయిస్ వినిపించడం ఆశ్చర్యం కలిగించింది. ఈ చిత్ర ఆడియోలో ‘ఆ పక్కనుంటావా’ అంటూ సాగే పాటను శివనాగులు అనే సింగర్ పాడిన సంగతి తెలిసింది. అతడి వాయిస్ కొంచెం భిన్నంగా.. బాగానే అనిపించింది. కానీ సినిమాలో చూస్తే అతడి వాయిస్ వినిపించలేదు. దేవిశ్రీ గొంతుతో ఉన్న వెర్షన్ తో పాటను రీప్లేస్ చేసేశారు. ఆడియోలో విన్న గొంతుకు.. సినిమాలో ఉన్నదానికి తేడా ఉండటంతో జనాలకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. చివరికి అక్కడ వినిపించింది దేవిశ్రీ వాయిస్ అని అర్థమైంది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. మరి శివనాగులు పాటను ఎందుకు తీసేసినట్లు.. దేవిశ్రీ పాటను ఎందుకు రీప్లేస్ చేసినట్లు? దేవి అసలెందుకిలా చేశాడు?

Follow Us:
Download App:
  • android
  • ios