Asianet News TeluguAsianet News Telugu

#Salaar తుఫాన్ ముందు ప్రశాంతతా లేక...?

ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం జరగదని వార్తలు రావటంతో ప్యాన్స్ షాక్ అవుతున్నారు.  వాస్తవానికి డిసెంబర్ మొదటి వారంలో సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

why Salaar team is not interested in promoting such a big film jsp
Author
First Published Dec 10, 2023, 11:44 AM IST


కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న   #Salaar చిత్రం  యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రెండు పార్టులుగా వస్తున్న సంగతి తెలిసిందే. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్‌ మెటీరియల్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూంటే ఓ ట్రైలర్ వదిలారు. మరో ట్రైలర్ సైతం రాబోతోందని అన్నారు. అయితే మొదట ట్రైలర్ అనుకున్నంత ఇంపాక్ట్ కలగచేయలేకపోయింది. అదే సమయంలో జనమంతా కూడా ఏనిమల్ మత్తులో ఉన్నారు. దాంతో వారిని బయిటకు తీసుకొచ్చి తమ సినిమావైపు తిప్పుకునే ప్రయత్నాలు ఇప్పటికే టీమ్ మొదలెట్టాలి. కానీ అటువంటుదేమీ జరగటం లేదు.

 దానికి తోడు ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం జరగదని వార్తలు రావటంతో ప్యాన్స్ షాక్ అవుతున్నారు.  వాస్తవానికి డిసెంబర్ మొదటి వారంలో సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాలేదు. అప్పుడే పదో తేదీకి వచ్చేసాము. ఎక్కడా సినిమాకు సంభందించి ఇంటర్వూలు కూడా ఇవ్వటం లేదు. ఇంత సైలెంట్ గా చిత్రం టీమ్ ఉండటానికి కారణం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

తమ దగ్గర సినిమా అవుట్ ఫుట్ చూసుకున్న ప్రశాంత్ నీల్ ..ప్రశాంతంగా ఉన్నారా..తుఫాన్ ముందు ఈ ప్రశాంతంత అవసరం అని భావిస్తున్నారా అని అంటున్నారు. ఎందుకంటే ప్రమోషన్ చేసినా చేయకపోయినా ఇప్పటికే ఉన్న బజ్ తో వీకెండ్ దాకా టిక్కెట్లు దొరకని పరిస్దితి నెలకొని ఉంటుంది.  ‘సలార్: పార్ట్ 1- సీజ్‍ఫైర్’ సినిమా రన్ టైమ్‍ వివరాలు వెల్లడయ్యాయి. ఈ మూవీ 2 గంటల 55 నిమిషాల (175 నిమిషాలు) రన్‍టైమ్ (నిడివి) ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. అంటే సుమారు 3 గంటలకు ఐదు నిమిషాలు తక్కువగా సలార్ మూవీ రన్‍టైమ్ ఉండనున్నట్టు తెలుస్తోంది. 

సలార్ మూవీ డిసెంబర్ 22న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుండగా.. ఆలోగానే మరో ట్రైలర్‌ను తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ ట్రైలర్‌లో ఫుల్ యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 18వ తేదీలోగా ఈ రెండో ట్రైలర్ రానుందని టాక్.
 
ఇక బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్ అని డైెరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పేశారు. సలార్ సినిమాకు ఫ్రెండ్‍షిప్ ముఖ్యమైన ఎమోషన్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “శత్రువుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్. సలార్‌లో ఫ్రెండ్‍షిప్ కోర్ ఎమోషన్. సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్‌లో సగం కథే చెబుతాం. సలార్ మొత్తం కథను రెండు సినిమాలుగా చూపిస్తాం. మేం సృష్టించిన ప్రపంచాన్ని ట్రైలర్లో ప్రేక్షకులు చూస్తారు” అని ప్రశాంత్ నీల్ చెప్పారు. సలార్ ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు రిలీజ్ కానుంది.  
 
బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు  తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్.  ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.   ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్.   ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా కూడా లెక్క చేయటం లేదు. 

సలార్‌గా ప్రభాస్, విలన్ వరదరాజ్ మన్నార్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ కాగా.. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి, రామచంద్ర రాజు కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios