Asianet News TeluguAsianet News Telugu

Pushpa: ఆ సీన్ డిలేట్ చేయటం వెనక అసలు కారణం ఇదా?

 ‘పుష్ప’ డిలీట్‌ సీన్‌-1ని షేర్‌ చేసింది. ఇది చూసిన వాళ్లు చాలా బాగుది ఈ సీన్ ...ఎందుకు తీసేసారా అని అంటున్నారు. ఈ వీడియోలో బన్నీ నటన, బాడీ లాంగ్వేజ్‌ అదిరిపోయేలా ఉందని.. 

Why pushpa team deleate that Scene?!
Author
Hyderabad, First Published Jan 2, 2022, 8:37 AM IST

సినిమా హిట్టయ్యాక ...డిలేటెడ్ సీన్స్ రిలీజ్ చేయటం ఆనవాయితీ. సినిమా ఆల్రెడీ చూసిన వాళ్లు తాము మిస్సైన సీన్స్ చూసి ముచ్చటపడిపోయి..సినిమాని మరోసారి గుర్తు చేసుకుంటారు. సినిమాని లైవ్ లో ఉంచుతారు. తాజాగా  ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తో  భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పుడు  ‘పుష్ప’ సినిమా నుంచి తొలగించిన కొన్ని సన్నివేశాలను  చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ‘పుష్ప’ డిలీట్‌ సీన్‌-1ని షేర్‌ చేసింది. ఇది చూసిన వాళ్లు చాలా బాగుది ఈ సీన్ ...ఎందుకు తీసేసారా అని అంటున్నారు. ఈ వీడియోలో బన్నీ నటన, బాడీ లాంగ్వేజ్‌ అదిరిపోయేలా ఉందని..ఈ సీన్‌ని ఎందుకు డిలీట్‌ చేశారో? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ సీన్ సినిమాలో తీసేసారు అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి...

ఈ సీన్ లో . ఊర్లో అందరి ముందు అవమానించి, డబ్బులు మాత్రమే కొంతమంది ముందే తీసుకుంటావా, అంటూ ప్రతి ఇంటికి అవమానించిన వ్యక్తిని తీసుకువెళ్తాడు. అలా  సుకుమార్ హీరోయిజాన్ని బాగానే ఎలివేట్ చేసారు. అయితే చేతిలో బొగ్గు వేసుకుని పళ్ళు తోముకున్న అల్లు అర్జున్, నెక్ట్స్ సీన్ లో కాలకృత్యాలకు వెళ్లడం కూడా చూపించారు. ఆ షాట్ తమిళం వాళ్లకు నచ్చవచ్చేమో కానీ మన వాళ్లకు ఎక్కదు ,తిట్టుకుంటారు అని బన్నీ చెప్పటంతో కట్ చేసారంటున్నారు. లెంగ్త్ కోసం తీసేయలేదని, ఫ్యామిలీలు వచ్చినా, ఆ షాట్ కు జుగుప్స అనిపిస్తుందని ప్రక్కన పెట్టేసారని చెప్తున్నారు. మన దగ్గర టాయిలెట్ కు వెళ్ళి కూర్చోవటం వంటి సీన్స్ సాధారణంగా పెట్టరు. అయితే తమిళ సినిమాలలో మాత్రం ఇలాంటి  సీన్లను సహజం పేరుతో చూపిస్తూంటారు.

https://www.youtube.com/watch?v=SRhfmuStb1E&ab_channel=MythriMovieMakers

ఇక  కుటుంబపోషణ నిమిత్తం అప్పు తీసుకున్న తన తల్లిపై రెడ్డప్ప అనే వ్యక్తి వీధిలో అందరి ముందు.. ‘‘భారతమ్మ ఎంతకాలం తప్పించుకుంటావ్‌ ఇట్టా. పోయిన గంగజాతరకు ఇస్తి. ఇప్పటిదాకా అసలు లేదు. వడ్డీ లేదు’’ అంటూ కేకలు వేయడంతో పుష్పరాజ్‌ అసహనానికి గురవుతాడు. దాంతో ఆ మరుసటి రోజు ఇంట్లో ఉన్న పశువులను అమ్మేసి రెడ్డప్పకు బాకీ చెల్లించేసిన పుష్పరాజ్‌..‘‘నీ లెక్క సరిపోయింది సరే.. మరి నా లెక్క. మేము అప్పు తీసుకున్నామని ఊరంతా తెలిసింది. మరి, తిరిగి ఇచ్చేశామని ఊరంతా తెలియవద్దా’’అని అతడిని కొట్టి ప్రతిఒక్క ఇంటికీ తీసుకువెళ్లి ‘‘పుష్పరాజ్‌ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు’’ అని చెప్పిస్తాడు. 

Also read Allu Arjun: అల్లు అర్జున్ ని లాక్కొచ్చిన అరవింద్,ప్లాన్ అదిరింది
 
 శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో బన్నీ హీరోగా నటించారు.  ‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పవచ్చు. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసిన ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు. చిత్తూరు యాస్‌లో బన్ని పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది.  రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

Also read Allu Arjun Pushpa: వైరల్ అవుతున్న పుష్ప డిలీటెడ్ సీన్, ఉంచి ఉంటే.. థియేటర్లు దద్దరిల్లేవి అంటున్న నెటిజన్లు

Follow Us:
Download App:
  • android
  • ios